తిరుపతి ఉప ఎన్నికపై పవన్ కీలక ప్రకటన

Wed Nov 25 2020 23:55:02 GMT+0530 (IST)

Pawan Kalyan Delhi Tour

ఢిల్లీకి వెళ్లిన మూడు రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలను కలిసి మీడియాతో కీలక విషయాలు చెప్పుకొచ్చారు. బీజేపీ హైకమాండ్ పెద్దలను కలిశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏకంగా గంట సేపు పవన్ కళ్యాణ్నాదెండ్ల మనోహర్ తో చర్చించారు.తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థినే నిలబెట్టాలని పవన్ ఢిల్లీ వెళ్లారని ప్రచారం సాగింది. జీహెచ్ఎంసీలో బీజేపీకి సపోర్టు చేసినందుకు తిరుపతి టికెట్ జనసేనకే ఇస్తారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే  నడ్డాతో భేటి అనంతరం జనసేనాని మీడియాతో మాట్లాడారు.

తిరుపతి ఉప ఎన్నిక గురించే మాట్లాడామని.. ఉమ్మడి అభ్యర్థి కోసం చర్చించినట్లు పవన్ తెలిపారు. రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా అభ్యర్థిని పెడుదామని నడ్డా చెప్పారని.. సదురు కమిటీ రిపోర్టుల తర్వాత తిరుపతి ఉప ఎన్నికల బరిలో జనసేన అభ్యర్థి ఉండాలా? బీజేపీ అభ్యర్థి ఉండాలా అనే దానిపై ఖరారవుతుందని పవన్ తెలిపారు. ఇంకో రెండు రోజుల్లో ఫైనల్ నిర్ణయం తేలిపోతుందని పవన్ స్పష్టం చేశారు.

తిరుపతి ఉప ఎన్నికతోపాటు అమరావతి తరలింపు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అంశాలపై నడ్డాతో చర్చించినట్టు పవన్ తెలిపారు. ఏపీలో బీజేపీ-జనసేనలు కలిసి ముందుకెళ్లాలన్న దానిపై మాట్లాడుకున్నామన్నారు. జగన్ సర్కార్ అవినీతి అక్రమాలు.. దేవాలయాలపై దాడులు.. శాంతి భద్రతల వైఫల్యం తదితర అంశాలపై నడ్డాతో చర్చించినట్టు పవన్ తెలిపారు.

ఇక అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్నది జనసేన నిర్ణయం అని.. తిరుపతి ఉప ఎన్నిక కోసం ఢిల్లీకి రాలేదని జనసేన మరో నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు.