Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌కు పిలుపు లేదు.. కానీ, మోడీని ఏమ‌న్నారంటే!

By:  Tupaki Desk   |   29 May 2023 11:01 AM GMT
ప‌వ‌న్‌కు పిలుపు లేదు.. కానీ, మోడీని ఏమ‌న్నారంటే!
X
కొత్త‌గా ప్రారంభించిన పార్ల‌మెంటు భ‌వ‌న వేడుక‌ల‌కు దేశ‌వ్యాప్తంగా బీజేపీ అనుకూల పార్టీలను పిల‌వ‌లేదు. కేవ‌లం ముఖ్య‌మం త్రుల‌ను మాత్ర‌మే కార్య‌క్ర‌మానికి ఆహ్వానించారు. ఇక‌, ఎంపీల‌ను పిలిచినా.. కేవ‌లం మోడీ ప్రసంగాన్ని వినేందుకు మాత్ర‌మే వారిని ప‌రిమితం చేశారు. ఈ క్ర‌మంలో ఏపీ విష‌యానికి వ‌స్తే... బీజేపీ మిత్ర‌ప‌క్షంగా ఉన్న జ‌నసేన‌కు కూడా ఆహ్వానం అంద‌లేదు. అయితే.. ఇత‌ర మిత్ర‌ప‌క్షాలు కినుక వ‌హించాయి. తాము ఎన్డీయే కూట‌మిలో ఉన్నా..పిలుపు అంద‌లేద‌ని ఒక‌రిద్ద‌రు నాయ‌కులు వ్యాఖ్యానించారు.

కానీ, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ మాత్రం ఆచితూచి వ్య‌వ‌హ‌రించారు. త‌న‌కు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందుతుంద‌ని ఆయ‌న ఆఖ‌రి క్ష‌ణం వ‌ర‌కు వేచి చూశారు. అయితే.. అంద‌లేదు. ఇది అధికారిక కార్య‌క్ర‌మం కావ‌డంతో ఆయ‌న‌కు ఆహ్వానం అంద‌లేద‌ని తెలిసింది.

అయితే.. చివ‌ర‌కు.. ఎట్ట‌కేల‌కు.. ప‌వ‌న్ రియాక్ట్ అయ్యారు. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం పురస్కరించుకుని ప్ర‌ధాని మోడీకి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. నూతన పార్లమెంట్ భవనం.. భరతమాతకు మరో మణిహారమని పేర్కొన్నారు.

స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుపుకొంటున్న 75 ఏళ్ల అమృత కాలంలో ఎన్నో మార్పులు, మరెన్నో చేర్పులు జరిగాయన్న పవన్.. పరాయి పాలకుల క్రీనీడలను పారదోలుతూ ఎన్నో కొత్త నిర్ణయాలు, విజయాలు అందుకున్నామన్నారు.

వివిధ రాష్ట్రాల కళల సమాహారంగా రూపుదిద్దుకున్న ఈ నిలయాన్ని(పార్ల‌మెంటు).. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన శుభ తరుణాన జనసేన తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ఈ మహాకృతి నిర్మాణానికి సంకల్పించిన నరేంద్ర మోడీకి, బీజేపీ నాయకత్వానికి అభినందనలు తెలిపారు.

త్రికోణాకారంలో రూపుదిద్దుకున్న ఈ మహాకృతి నిర్మాణానికి సంకల్పించిన నరేంద్ర మోడీకి, బి.జె.పి. నాయకత్వానికి శుభాభినందనలు తెలుపుతున్నానని ప‌వ‌న్ పేర్కొన్నారు. భవన నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరూ చరితార్ధులుగా భావిస్తున్నానని ఆయన తెలిపారు.