ఎస్ నేను ఫెయిల్యూర్ పొలిటీషియన్...పవన్ డేరింగ్ స్టేట్మెంట్

Sat Dec 03 2022 22:00:23 GMT+0530 (India Standard Time)

Pawan Daring Statement

పవన్ కళ్యాణ్ తన రాజకీయ జీవితంలో ఇప్పటిదాకా అనని ఒక మాట అన్నారు. నిజంగా ఆ మాట అనడానికి గట్స్ చాలా ఉండాలి. చాలా మంది తెలిసి కూడా అనలేరు. వారు తమను మభ్యపెట్టుకుంటూ ఇతరులను మభ్యపెడతారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తాను అలా కాదు అనిపించారు. అందుకే ఆయన నోట ఒక మాట వచ్చింది. అది మాట కాదు డేరింగ్ అండ్ డేషింగ్ స్టేట్మెంట్. అదే నేను ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని.నిజంగా ఈ మాటను వింటే ఎవరి సంగతి ఏమో కానీ జనసైనికులు ఫుల్ గా హర్ట్ అవుతారు. వారే పవన్ స్టేట్మెంట్ ని ఒప్పుకోమని అంటారు. అదే టైం లో పవన్ కళ్యాణ్ డ్రై హార్డ్ ఫ్యాన్స్ కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తారు. కానీ పవన్ మాత్రం తన మనసులో నుంచి వచ్చిన మాటగా దాన్ని చెప్పేశారు. ఆయన ఈ విధంగా తనను తాను విశ్లేషించుకోవడమే ఆయనలోని లీడర్ ని తెలియచేస్తోంది. ఆయన నాయకత్వ లక్షణాలను కూడా తెలియచేస్తోంది.

ఇంతకీ పవన్ ఎక్కడ ఈ మాట అన్నారు అంటే హైదరాబాద్ శిల్ప కళా వేదికలో జరిగిన ఇన్సిస్ట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో పవన్ ముఖ్య అథిదిగా మాట్లాడుతూ ఈ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇది ఎంత బోల్డ్ గా ఆయన చెప్పారో కూడా అర్ధం చేసుకోవాలి. ఆయన ఒక మాట చెప్పారు. విజయం ఎపుడు వరిస్తుంది అంటే అది వైఫల్యం నుంచే అని. ఆ విధంగా తాను ఫెయిల్యూర్ పొలిటీషియన్ గా ఉన్నా విజయం వైపుగా అడుగులు వేస్తున్నాను అని ఆయన చెబుతూ యువతకు ఉత్తేజపరచే ప్రసంగం చేశారు.

ఇదిలా ఉండగా పవన్ ఈ మాట చెప్పినప్పటికీ ఆయన పట్ల ఆదరణతో మొత్తం సదస్సు జరిగే ప్రాంగణం అంతా ఈలలు గోలలతో దద్దరిల్లిపోయింది. పవన్ నిజాయతీకి ఆయన తన పట్ల తనకు ఉన్న అంచనాను తన నాయకత్వాన్ని పెంచుకునే దిశగా చేస్తున్న కృషిని అన్నీ ఆ ఒక్క మాటలో చూసిన వారంతా శభాష్ సేనానీ అంటూ చప్పట్లతో తమ హర్షం వ్యక్తం చేశారు.

నిజానికి పవన్ చెప్పిన మాట నెగిటివిటీతో ఉంది. ఆ మాట ఎవరూ కలలో కూడా అనుకోరు. హిపోక్రసీ నిండా నింపుకుని మాట్లాడే రాజకీయ రంగంలో నాయకులు ఎవరూ అసలు ఆ మాట వాడరు. కానీ పవన్ తన రాజకీయం ఇదీ అని చెప్పి జనాల్లోకి వచ్చారు. ఆయన అలాగే చేస్తున్నారు కాబట్టే ఈ విధంగా డేరింగ్ గా అనగలిగారు అని అంతా విశ్లేషిస్తున్నారు.

ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ పొలిటీషియన్ అంటే జనసైనికులు హర్ట్ అవుతారేమో కానీ తమ నాయకుడు గుండె నిబ్బరాన్ని చూసి వారు ఇంతకు వేయింతలు సంబరపడతారు. అంతే కాదు ఓడిన చోటనే ఈ రోజు కేక పెట్టిస్తూ బలంగా ఉన్నామనుకుంటున్న పార్టీలకు కలవరపెడుతూ ఫ్యూచర్ సీఎం గా విశ్లేషణలలో ఉన్న పవన్ ఫెయిల్యూర్ పొలిటీషియన్ ఎలా అవుతారు. కచ్చితంగా కారు. ఆయన 2019 ఫలితాలతో ఆగిపోయి ఉంటే పార్టీని మూసుకుని ఉంటే అలా అయ్యేవారు.

కానీ ఆయన నడక ఆపలేదు. ఆయన పోరాటం ఆపలేదు. అందుకే ఆయన ఫెయిల్యూర్ నుంచి రేపటి సక్సెస్ కోసం వడివడిగా అడుగులు వేస్తున్న ఫ్యూచర్ లీడర్ గానే అంతా చూస్తున్నరు. సో పవన్ చెప్పినది కూడా ఇదే. యువత కూడా ఫెయిల్యూర్స్ నుంచే విజయానికి సోపానాలు వేసుకోవాలనే ఆయన తన సందేశాన్ని ఇచ్చారనుకోవాలి.

పైగా తాను ఫెయిల్ అయ్యాను అన్న దానికి ఏమీ బాధపడడం లేదని అంగీకరిస్తానని విజయానికి అక్కడ నుంచే సాధన చేస్తున్నాను అని పవన్ చెప్పుకొచ్చారు. తమ పరాజయాన్ని చెప్పుకోవడానికి మొహమాటమే పడను అని పవన్ చెప్పిన తీరు కూడా ఇపుడు ఎంతో మందిని ఆకర్షిస్తోంది. ఎంతో మందికి అది స్పూర్తిగా మారుతోంది. దటీజ్ సేనాని అనిపించారుగా. సో ఆయన అలా సక్సెస్ అయ్యారు కదా.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.