Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాపై ఉక్కుపాదం.. పార్లమెంటరీ ప్యానెల్ సిఫార్సు

By:  Tupaki Desk   |   26 Nov 2021 2:30 AM GMT
సోషల్ మీడియాపై ఉక్కుపాదం.. పార్లమెంటరీ ప్యానెల్  సిఫార్సు
X
పొద్దు పొద్దున్ననే వాట్సాప్.. టిఫిన్ చేస్తూ ట్విటర్.. టీ తాగుతూ ఇన్ స్టాగ్రామ్.. లంచ్ చేస్తూ యూ ట్యూబ్.. సాయంత్రం ఫేస్ బుక్.. ఇదీ ప్రస్తుతం ఎక్కువ శాతం భారతీయుల జీవనశైలి. రాత్రంతా సోషల్ మీడియాలో గడిపేవారు ఇంకెందరో..? వీటి కోసం జీవితంలో విలువైన సమయాన్ని వేస్ట్ చేస్తున్నవారు కోట్లమంది.

ఇదంతా నాణేనికి ఒకవైపు అయితే, మరోవైపు సోషల్ మీడియా దుర్వినియోగం మరోవైపు. నచ్చనివారిపై నిందలు.. దుమ్మెత్తిపోయడం సాధారణం అయిపోయాయి. వీటన్నిటికీ మించి.. వినియోగదారుల సమాచార గోప్యత పెద్ద అంశమై కూర్చుంది. ఫేస్ బుక్, ట్విటర్ వంటి దిగ్గజ సంస్థలు భారతీయుల డేటా ను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి.

నియంత్రణకు ప్యానెల్

వినియోగదారుల డేటా దుర్వినియోగం కట్టడికి సోషల్ మీడియాపై నియంత్రణ ఉండాలన్న వాదన
ఎప్పటినుంచో ఉన్నది. ఈ ప్లాట్‌ఫారమ్‌లను పర్యవేక్షించడానికి.. వారి ఏకపక్ష వైఖరిని నిరోధించడానికి నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని భారత పార్లమెంటరీ ప్యానెల్ తాజాగా సిఫార్సు చేసింది.

ఇందులో భారతీయ ప్రెస్‌ను నియంత్రించే బాడీ వంటి కొత్త నియంత్రణ సంస్థను రూపొందించాలని సూచించింది. అలాగే, ఈ నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలకు 4% వరకు జరిమానా కూడా విధించవచ్చు.

2019లో ప్రవేశపెట్టిన వ్యక్తిగత సమాచార గోప్యత బిల్లును దృష్టిలో ఉంచుకుని ఒక రెగ్యులేటరీ బాడీ ఏర్పాటుపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అత్యున్నత స్థాయి కమిటీలా ఏర్పాటు చేయడం గురించి రెగ్యులేటరీ బాడీ మాట్లాడింది. ఇది గూగుల్ (Google) అమెజాన్(Amazon Inc) వంటి కంపెనీలు స్టోర్ చేసే డేటాను పూర్తిగా ఆపడానికి సహాయపడుతుంది.

ఇండియన్ ప్రెస్‌ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎలా నియంత్రిస్తుందో, అదే విధంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల కోసం రెగ్యులేటరీ బాడీని ఏర్పాటు చేయాలని కమిటీ చెబుతోంది.

ఈ శీతాకాల సమావేశాల్లో బిల్లు.

నివేదికలోని సిఫార్సులను నవంబర్ 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ప్యానెల్ హెడ్, భారతీయ జనతా పార్టీ మంత్రి పీపీ చౌదరి తెలిపారు. ఈ బిల్లులో పేర్కొన్న నిబంధనలను పాటించకపోతే, సోషల్ మీడియా కంపెనీల ప్రపంచ ఆదాయాల్లో 4% వరకు జరిమానా విధించే నిబంధన ఉండవచ్చు.