Begin typing your search above and press return to search.

రోహిత్​, మహీని ఓడించాడంటే పంత్ మామూలు స్వింగ్​ లో లేడు..!

By:  Tupaki Desk   |   22 April 2021 4:43 AM GMT
రోహిత్​, మహీని ఓడించాడంటే పంత్ మామూలు స్వింగ్​ లో లేడు..!
X
గాయం కారణంగా శ్రేయస్​ అయ్యర్​ ఈ సారి ఐపీఎల్​ కు దూరం కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్సీ బాధ్యత పంత్​ తీసుకున్నాడు. అయితే పంత్​ ను కెప్టెన్​ గా తీసుకోవడం పట్ల విమర్శలు వచ్చాయి. ఇటు సీనియర్​ క్రికెటర్లు, అటు నెటిజన్లు.. ఏ మాత్రం అనుభవం లేని పంత్.. ఢిల్లీ జట్టును ఎలా నడిపిస్తాడంటూ విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలను చాలెంజింగ్​గా తీసుకున్న పంత్​ దూసుకుపోతున్నాడు. దిగ్గజ జట్లు ముంబై ఇండియన్స్​, సీఎస్​కేలను సైతం మట్టి కరిపించాడంటే అతడి స్టామినా ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

గతంలో విమర్శించిన వాళ్లు సైతం ఇప్పుడు పంత్​ ను మెచ్చుకుంటున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్​ కు అద్భుతమైన బౌలింగ్​ ప్రదర్శన ఉంది. మరోవైపు ఫీల్డింగ్​ లోనూ ఆ జట్టు బాగా రాణిస్తుంది. దీనికి తోడు గబ్బర్​ ( శిఖర్ ధవన్​) ఫుల్​ ఫామ్​ లో ఉన్నాడు. ప్రతి మ్యాచ్​ లోనూ శిఖర్​ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆరెంజ్​ క్యాప్​ రేసులో ముందున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్​ రికీ పాంటింగ్​.. ఢిల్లీ క్యాపిటల్స్​ కు హెడ్​ కోచ్​ గా వ్యవహరిస్తున్నాడు. ఈ అంశాలన్నీ పంత్​కు కలిసి వస్తున్నాయి.

బౌలింగ్​ విషయంలోనూ పంత్ ఎంతో కేర్​ తీసుకుంటున్నాడు. టీమ్​ ను అద్భుతంగా లీడ్​ చేస్తున్నాడు. దీంతో పంత్​ కెప్టెన్సీ పట్ల ప్రశంసలు దక్కుతున్నాయి. నిజానికి గత ఏడాది ఐపీఎల్​లో పంత్​ పెద్దగా రాణించలేదు. అయితే ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్​, ఇంగ్లండ్​ తో జరిగిన మ్యాచ్​లలో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్​ యాజమాన్యం పంత్​ కు కెప్టెన్సీబాధ్యతలు అప్పగించింది. బాధ్యతలను పంత్​ ఎంతో చక్కగా వినియోగించుకుంటున్నాడు.

తనను తాను సమర్థుడైన కెప్టెన్‌ గా నిరూపించుకుంటున్నాడు. ఈ ఎడిషన్‌లో ఢిల్లీ నాలుగు మ్యాచ్‌లు ఆడి వాటిలో మూడు గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ వంటి పెద్ద జట్లపై ఢిల్లీ గెలవడం గమనార్హం.