భారత్ లో భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు .. 24 గంటల్లో ఎన్నంటే !

Sat Oct 17 2020 15:00:19 GMT+0530 (IST)

The number of positive cases in India has come down drastically .. in 24 hours!

భారత్ లో కరోనా మహమ్మారి జోరు క్రమంగా తగ్గుతూ వస్తుంది. గత కొద్దిరోజులుగా నమోదు అయ్యే కరోనా పాజిటివ్ కేసులు కూడా తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఇప్పటివరకు దేశంలో నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 74 లక్షలు దాటింది. తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 62212 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7432681కి చేరింది. నిన్న ఒక్క రోజే 837 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 112998 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు.ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న 6524596 మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 795087గా ఉంది. కరోనా రోగుల రికవరీ రేటు 87.78 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.52 శాతానికి తగ్గింది. గడిచిన 24 గంటల్లో 999090 కరోనా టెస్టులు చేయగా ఇప్పటి వరకు మొత్తం 93254 017 టెస్టులు నిర్వహించారు.

ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల్లో అమెరికా అగ్రస్థానం లో కొనసాగుతోంది. భారత్ బ్రెజిల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా తోలి స్థానానికి చేరగా ... ఇండియా బ్రెజిల్ తర్వాతి పొజిషన్లలో ఉన్నాయి. మొత్తం మరణాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. బ్రెజిల్ ఇండియా తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.