వైరల్ వీడియో: జన గణ మన వాయించిన పాకిస్థానీ సంగీతకారుడు

Mon Aug 15 2022 22:40:48 GMT+0530 (India Standard Time)

Pakistani musician who played Jana Gana Mana

ఇండియా పాకిస్తాన్ లు విడిపోయినా అవి ఒకప్పుడు ఒకే దేశం. బ్రిటీష్ వారు పోతూ పోతూ మనల్ని విడగొట్టి చెడగొట్టి శత్రువులుగా మార్చారు. లేదంటే చరిత్రలో ఇప్పుడున్న ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక ఒకే దేశంగా ఉండేది. ఒక పెద్ద ఉపఖండంగా వర్దిల్లేది.చైనాను మించి ఎదిగి ఉండేది.కానీ విడిపోయి కక్షలు కార్పణ్యాలతో నలిగిపోతున్న పరిస్థితి నెలకొంది. తాజాగా ఇండియా 75 ఏళ్ల స్వాతంత్ర్య పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటోంది. ఆ పండుగనాడు దేశమంతా జెండాలు ఎగిరాయి. అయితే మనకంటే ఒకరోజు ముందు ఆగస్టు 14న పాకిస్తాన్ స్వాతంత్య్రం పొందింది. కరుడుగట్టిన పాకిస్తానీయుల నోట ఎప్పుడూ భారత్ అన్నా.. మన జెండా అన్నా.. జాతీయ గీతం అన్నా విద్వేషాన్నే చూపిస్తారు. కానీ ఈ పాకిస్తానీ సంగీత కళాకారుడి చేతి నుంచి మన జాతీయగీలాపన వాయిద్యంగా బయటకు రావడం వైరల్ అయ్యింది.

ఆగస్ట్ 14వ తేదీ అర్ధరాత్రి అంటే ఆగస్ట్ 15 1947 మొదటి నిమిషంలో బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశం విముక్తి పొంది స్వాతంత్ర్యం పొంది. భారతదేశం మరియు పాకిస్తాన్ అనే రెండు దేశాలుగా విభజించబడింది. భారతీయులమైన మనం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటే పాకిస్థానీయులు 14వ తేదీన జరుపుకుంటారు. వారు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని ఎవరైనా ఆశ్చర్యపోతారు. అయితే పాకిస్తాన్ ప్రజలు మనకంటే ఒకరోజు ముందే శుభాకాంక్షలు చెప్పుకోవాలని నాడు ఇలా చేసి ఉంటారని చెబుతారు.

పాకిస్తానీ ప్రముఖ గిటారిస్ట్ తాజాగా భారత జాతీయ గీతాన్ని వాయించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రబాబ్ అనే స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్లో వివిధ సూపర్హిట్ పాటలను వాయించడంలో ప్రసిద్ధి చెందిన పాకిస్తాన్కు చెందిన సంగీతకారుడు సియాల్ ఖాన్ సరిహద్దు వెంబడి ఉన్న తన అభిమానులకు బహుమతి ఇచ్చాడు. మనం 76వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఆయన భారత జాతీయ గీతం ‘జన గణ మన’ వాయిద్య రూపాన్ని హృద్యంగా వాయించి మనదేశానికి గొప్ప గౌరవాన్ని ఇచ్చాడు.. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటికే భారతీయులు తమ స్వాతంత్య్రాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. కానీ ఒక శత్రుదేశం వాయిద్యకారుడు మన జాతీయ గీతాన్ని వాయించడమే వైరల్ అయ్యింది. దేశ సరిహద్దు అవతల నుండి వచ్చిన ఈ బహుమతి దానిని మరింత ప్రత్యేకం చేసింది.

నిస్సందేహంగా సియా ఖాన్ అందించిన ప్రదర్శన శక్తివంతమైనది ఆహ్లాదకరమైనది. హృదయపూర్వకంగా ఉంది. “భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మన మధ్య శాంతి సహనం మరియు సత్సంబంధాల కోసం స్నేహం.. సద్భావనకు చిహ్నంగా నేను భారతదేశ జాతీయ గీతాన్ని ప్రయత్నించాను. #IndependenceDay202” అని కళాకారుడు వీడియోను షేర్ చేశాడు. పాక్ వాయిద్యకారుడు భారత జాతీయ గీతం వాయించడాన్ని అక్కడి వారు ఆగ్రహించగా.. భారతీయులు మాత్రం స్వాగతించారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే ట్రెండ్ అవుతోంది.

గతంలో సియా ఖాన్  అనే పాకిస్తాన్ ప్రముఖురాలు సూపర్హిట్ బాలీవుడ్ పాటల ఇన్స్ట్రుమెంటల్ వెర్షన్లను ప్లే చేసింది. ఆ వీడియోలు యూట్యూబ్లో హిట్ అయ్యాయి. పాక్ జాతీయులంతా ఆమెపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఇప్పుడు ఈ వాయిద్యకారుడికి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో చూడాలి మరీ..