Begin typing your search above and press return to search.

వదల కరోనా వదల.. తగ్గిందని పార్టీ ఇస్తే మళ్లీ అంటుకుంది

By:  Tupaki Desk   |   29 March 2020 1:30 AM GMT
వదల కరోనా వదల.. తగ్గిందని పార్టీ ఇస్తే మళ్లీ అంటుకుంది
X
కరోనా సోకుతుందని జనాలు బయటకు రావద్దని ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ లు చేతులెత్తి మొక్కినా ఇంకా జనాలు వినకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి దేశంలో చూస్తున్నాం. కూరగాయాలు, నిత్యావసరాల వద్ద గుంపులుగా కనిపిస్తూనే ఉన్నారు. పద్ధతిగా ఉండే మనదగ్గరే ఇలా ఉంటే ఇక బాంబుల మోత, మత కట్టుబాట్లు, చాందసవాదం, ఉగ్రవాదం తో అట్టుడికే పాకిస్తాన్ లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

పాకిస్తాన్ లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. భారత్ కు మించి డబుల్ కేసులు నమోదయ్యాయి. అక్కడి జనాల నిర్లక్ష్యం, మసీదుల్లో నమాజులతో గూమిగూడడంతో పెద్ద ఎత్తున సోకుతోందట.. గుంపులుగా తిరగవద్దని ప్రభుత్వం సూచించినా వినని జనాలతో ఈ వైరస్ వ్యాప్తి చెందుతోందట..తాజాగా పాకిస్తాన్ జనాల నిర్లక్ష్యానికి నిలువుటద్దం లాంటి ఒక ఉదాహరణ వెలుగుచూసింది.

పాకిస్తాన్ లోని రావల్పిండికి చెందిన ఓ వ్యక్తికి రెండు వారాల కిందట కరోనా సోకింది. అతడిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స చేశారు. నెగెటివ్ రావడం తో ఇంటికి పంపించారు. బుద్దిగా ఇంట్లో ఉండి కరోనా రక్షణ చర్యలు తీసుకుంటే సరిపోయేది. కానీ కరోనా జయించానని ఆ ప్రబుద్ధుడు 100మంది స్నేహితులు, బంధువులను పిలిచి పార్టీ ఇచ్చాడు. అదే అతడిపాలిట శాపమైంది. అందులో ఒక వ్యక్తికి కరోనా ఉండడం తో మళ్లీ ఇతగాడికి కరోనా వచ్చేసింది. నిర్లక్ష్యంగా పార్టీ ఇచ్చి కరోనా వ్యాపింప చేసిన ఇతడిపై పోలీసులు కేసు కూడా పెట్టారు.

ప్రస్తుతం పాకిస్తాన్ లో 1230 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 10 మంది చనిపోయారు. అయినా అక్కడి జనాలు నిర్లక్ష్యం వీడడం లేదు.