కేటీఆర్ ను వదిలిపెట్టని పద్మారావు.. మళ్లీ అదే పాట?

Sun Jan 24 2021 05:00:02 GMT+0530 (IST)

Padmarao said the same thing again on KTR

ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించి ఓ అభివృద్ధి కార్యక్రమంలో కేటీఆర్ పక్కనే నిలుచుండి మరీ 'కాబోయే సీఎం కేటీఆర్' అని నినదించారు తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు. దీనిపై కేటీఆర్ మాట కూడా మాట్లాడలేదు. అసలు ఈ టాపిక్ తీయకుుండా ప్రసంగం ముగించి వెళ్లారు.అయితే ఆ తర్వాత టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలకు స్టిక్ట్ గా అలా అనొద్దంటూ ఫోన్లు చేసి చెప్పాడని వార్తలు వచ్చాయి. అందులో నిజం ఎంతో తెలియదు కానీ కొన్ని నోళ్లు అయితే మూగబోయాయి.

అయితే అందరూ ఆగినా డిప్యూటీ స్పీకర్ పద్మారావు మాత్రం ఆ మాట వదలడం లేదు. తాజాగా మీడియా సమావేశంలో మరోసారి 'త్వరలోనే కేటీఆర్ సీఎం అవ్వబోతున్నాడని' స్పష్టం చేశారు. కేటీఆర్ పనితీరు చాలా బాగుందని.. అసలు నాలుగేళ్ల క్రితమే కేటీఆర్ సీఎం అవుతాడని తాను చెప్పానని పద్మారావు ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

దీంతో మరోసారి కేటీఆర్ సీఎం అన్న ప్రచారం కుదిపేస్తోంది. ఇప్పటికే తెలంగాణ అధికార ప్రజాప్రతినిధుల వర్గాల్లో ఇప్పుడు దీనిపైనే చర్చ జరుగుతోందట.. కేటీఆర్ సీఎం అవుతాడా? లేదా ఇది వట్టి ప్రచారమా అన్నది తేలాల్సి ఉంది.

అయితే అయినా కాకపోయినా.. కేటీఆర్ ను ప్రసన్నం చేసుకునేందుకు ముందుగానే 'కేటీఆర్ సీఎం' అంటూ నేతలు కాకపడుతున్న తీరు మాత్రం కనిపిస్తోంది. మంత్రి పదవుల కోసమే ఈ భజన అంతా గుసగుసలు తెలంగాణ రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి.