నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ -51 .. ఇస్రో ఖాతాలో మరోఘనత..!

Sun Feb 28 2021 12:37:02 GMT+0530 (IST)

PSLVC-51 crashes .. Another ISRO account ..!

ఇస్రో శాస్త్రవేత్తలు మరో అరుదైన ఘనత సాధించారు. ఇప్పటికే వందలాది ప్రయోగలను విజయవంతంగా చేపట్టిన ఇస్రో మరో అరుదైన ఘనత సాధించింది. శాస్త్రవేత్తలు  పీఎస్ఎల్వీ సీ -51 రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపించారు. ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఈ ప్రయోగం చేసినట్టు ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు.మొత్తం 19 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్టు ఐస్రో చైర్మన్ శివన్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం సరిగ్గా 10.24 గంటలకు ధ్రువ ఉపగ్రహ ప్రయోగ వాహననౌక సీ51 (పీఎస్ఎల్వీ) నింగిలోకి వెళ్లింది.

ప్రయోగ వేదిక నుంచి రాకెట్ 17 నిమిషాల పాటు పయనించి బ్రెజిల్‌కు చెందిన అమోజోనియా శాటిలైట్‌ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ప్రయోగం నేపథ్యంలో షార్‌లో పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేశారు. బ్రెజిల్ దేశ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి మార్కోస్ క్వాంటన్ షార్కు చేరుకొని ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. పీఎస్ఎల్వీ సీ 51 వాహననౌక ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమెజోనియా-1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపించారు. ప్రయోగం విజయవంతం కావడం పట్ల శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.

అంతరిక్షంలోకి మోదీ ఫొటో..

ఉపగ్రహం ద్వారా అంతరిక్షంలోకి ప్రధాని మోదీ ఫొటో పంపించారు. మోదీ ఫొటో ఆత్మనిర్భర్ మిషన్ భగవద్గీత కాపీ వెయ్యిమంది విదేశీయుల పేర్లతోపాటు చెన్నైకి చెందిన విద్యార్థుల పేర్లను కూడా అంతరిక్షంలోకి పంపారు. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో చైర్మన్ శివన్ హర్షం వ్యక్తం చేశారు.