Begin typing your search above and press return to search.

రాహుల్ ను అంత పీకి లాగాలా? ఎమోషన్ అస్త్రం సరిపోలేదా మోడీజీ?

By:  Tupaki Desk   |   18 March 2023 9:51 AM GMT
రాహుల్ ను అంత పీకి లాగాలా? ఎమోషన్ అస్త్రం సరిపోలేదా మోడీజీ?
X
ప్రధాని నరేంద్ర మోడీకి ఏమైంది? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం మాదిరి.. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీపై సంధిస్తున్న అస్త్రాలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి.  రాహుల్ ఎంత? ఆయన స్థాయి ఏంత? ఆయన మాటల ప్రభావం మరెంత? తమ జాతీయత అస్త్రం ముందు ఎవరైనా సరే తేలిపోవాలన్నట్లుగా వ్యవహరించే బీజేపీ అధినాయకత్వం.. తాజాగా రాహుల్ పై స్పందిస్తున్న తీరు చూస్తే.. మోడీ మాష్టారు మరీ ఇంతలా యాక్షన్ ప్రదర్శించాలా? అన్న అభిప్రాయం కలుగక మానదు.
విదేశీ గడ్డ మీద భారత సర్కారును అదేనండి మోడీ సర్కారుపై చేసిన ఘాటు విమర్శలపై క్షమాపణలు చెప్పాలని.. లేదంటే సభలో మాట్లాడనిచ్చే పరిస్థితే లేదంటూ మొండితనాన్ని ప్రదర్శించటం ఎంతవరకు సబబు? అని ప్రశ్నిస్తున్నారు. విదేశీ గడ్డ మీద భారత్ ను అవమానించారని.. అందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని.. లేని పక్షంలో సభలో ఆయన్ను మాట్లాడనిచ్చేది లేదని మండిపడటంలో అర్థం లేదని చెప్పాలి. ఇటీవల తన విదేశీ పర్యటన సందర్భంగా రాహుల్ పలు వేదికల మీద మోడీ సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

దేశంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలపై మోడీ సర్కారు మండిపడుతోంది. తాజాగా మరో అడుగు ముందుకు వేసి.. ‘భారత్ లో ప్రజాస్వామ్యంపై క్రూరమైన దాడి జరుగుతోందని రాహుల్ కేంబ్రిడ్జి వర్సిటీలో వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన క్షమాపణలు చెప్పాలి. ఆయన వ్యాఖ్యలపై ప్రత్యేక పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి విచారించాలి. దాని నివేదిక ఆధారంగా ఆయన్ను సభ నుంచి బహిష్కరించే అవకాశం ఉందా? అన్నది పరిశీలించాలి’’ అంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే రాసిన లేఖ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

నిజంగానే రాహుల్ తప్పుడు పని చేశారనే అనుకుందాం? అలా చేసినప్పుడు కమలనాథుల చేతిలో రెడీగా ఉండే జాతీయత అస్త్రాన్ని బయటకు తీస్తే సరిపోతుంది కదా? అంతేకానీ.. రాహుల్ ను సభ నుంచి బహిష్కరించే తీవ్ర చర్యలు ఎందుకు? అన్నది ప్రశ్నగా మారింది. ప్రధాని మోడీ స్థాయికి  ఈ తరహా చర్యలు ఏ మాత్రం సూట్ కావని.. ఇలాంటివి చేస్తే.. రాహుల్ ఆరోపణలు నిజమయ్యే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాహుల్ సారీ చెప్పాల్సిందేనని కేంద్ర మంత్రులు రాజ్ నాథ్, కిరణ్ రిజిజు, గోయల్ తదితరులు సైతం డిమాండ్ చేయటం చూస్తుంటే.. మోడీ మాష్టారు ఈసారి మరీ సీరియస్ గా ఉన్నారా? అన్న సందేహం కలుగుక మానదు. విదేశీ గడ్డ మీద తనను డ్యామేజ్ చేసే ప్రయత్నాన్ని ఆదిలోనే అడ్డుకునేందుకే ఈ తీవ్ర చర్యలకు కమలనాథులు డిమాండ్ చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. రాజకీయం అన్న తర్వాత మాటలు అనుకోవటం మామూలే అని.. అంత మాత్రానికే చర్యల కత్తి పట్టుకొని వీధుల్లో తిరగాల్సిన అవసరం ఏముందని.. ప్రజలకు వదిలేస్తే వారే ఓటుతో నిర్ణయం తీసుకుంటారు కదా? అన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. రాహుల్ పై చర్యలకు కమలనాథులు డిమాండ్ చేస్తున్న తీరు చూసినప్పుడు మాత్రం మోడీ మాష్టారు బాగానే హర్ట్ అయ్యారన్నది మాత్రం అర్థమవుతుందని చెప్పాలి. ఫర్లేదే.. మోడీ మాష్టారిని రాహుల్ ఆ మాత్రం హర్ట్ చేసేంతగా రాహుల్ రాటుదేలారని అనుకోవాలా?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.