Begin typing your search above and press return to search.

మోడీ సంస్కరణ.. ప్రైవేట్ చేతికి 41 బొగ్గుగనులు

By:  Tupaki Desk   |   18 Jun 2020 2:30 PM GMT
మోడీ సంస్కరణ.. ప్రైవేట్ చేతికి 41 బొగ్గుగనులు
X
ప్రధాని మోడీ ఈ కరోనా కష్టం వేళ అతిపెద్ద సంస్కరణ చేశారు. జాతీయ సంపద అయిన బొగ్గుగనులను ప్రైవేటుకు ధారాధత్తం చేసేశారు. తాజాగా 41 బొగ్గుగనులను ప్రైవేటుకు అప్పగించేందుకు వేలం ప్రక్రియను ప్రారంభించారు. తద్వారా గల్లా పెట్టే నింపుకునేందుకు నడుం బిగించారు.

కరోనా సంక్షోభాన్ని భారత్ అవకాశంగా మలుచుకుటుందని.. ఆర్తిక స్వావలంభన సాధిస్తుందని మోడీ అన్నారు. రాబోయే రోజుల్లో భారత్ విదేశీ ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవాలనుకుంటోందని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఎగుమతిదారుగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

దేశంలో 2030 నాటికి పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఇందుకోసం 4 ప్రాజెక్టులు చేపడుతున్నామని మోడీ తెలిపారు. కోల్ సెక్టర్ లో ప్రైవేట్ పెట్టుబడులు అతిపెద్ద సంస్కరణగా మోడీ అభివర్ణించారు. 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం ఉంటుందన్నారు. దేశంలో 41 బొగ్గు గనులను ప్రైవేటీకరించడం ద్వారా ఏడేళ్లలో రూ.33వేల కోట్ల పెట్టుబడులు పెరుగుతాయన్నారు. రాష్ట్రాలకు ఈ గనుల ద్వారా ఏటా రూ.20వేల కోట్లు ఆదాయం వస్తుందన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా 2.8 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి లభిస్తుందన్నారు.