Begin typing your search above and press return to search.

గురుపూర్ణిమ.. మోడీపై ఎక్కుపెట్టిన రాహుల్ అస్త్రం

By:  Tupaki Desk   |   5 July 2020 11:19 AM GMT
గురుపూర్ణిమ.. మోడీపై ఎక్కుపెట్టిన రాహుల్ అస్త్రం
X
దేశవ్యాప్తంగా గురుపూర్ణిమ వేడుకలు ఆదివారం ఘనంగా జరుగుతున్నాయి. గౌతమ బుద్ధుడి ధర్మచక్రపరివర్తనను, వేద వ్యాసుడి జయంతి సందర్భంగా ఈ గురుపౌర్ణమిని దేశంలో హిందువులు, బౌద్దులు ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ నుంచి పలు పార్టీల కీలక నేతలు అందరూ గురుపూర్ణిమ శుభకాంక్షలు తెలిపారు.

గురుపూర్ణిమ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మోడీ ట్వీట్ చేస్తూ ‘మన జీవితాలను అర్థవంతంగా మార్చే గురువులను గౌరవించడానికి ఇదొక ప్రత్యేకమైన రోజు. ఈ సందర్భంగా గురువులందరికీ నా శుభాకాంక్షలు’ అని మోడీ ఆదివారం ట్వీట్ చేశారు. ఇక ఈ సందర్భంగా ‘ధర్మచక్ర దినోత్సవం’లోనూ మోడీ కీలక ప్రసంగం చేశారు. బుద్ధుడు నేర్పిన జ్ఞానాన్ని అనుసరించాలని మోడీ సూచించాడు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాత్రం ఈ గురుపూర్ణమిని వదలలేదు. ఇప్పటికే చైనాతో ఫైట్ పై మోడీని ఆడిపోసుకున్న రాహుల్ గాంధీ సైనికుల మరణంపై మోడీ నిజాలు దాస్తున్నాడని ఆరోపించారు. తాజాగా ట్వీట్ లోనూ మోడీని నిలదీసేలా వ్యాఖ్యానించాడు.

రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ.. ‘సూర్యుడు, చంద్రుడు, యాథార్థం.. ఈ మూడింటిని ఎన్నటికీ దాచిపెట్టలేమని గౌతమ బుద్దుడు అన్నారు. గురుపూర్ణిమ సందర్భంగా ప్రజలకు శుభాభినందనలు’ అంటూ వ్యాఖ్యానించారు. ఇలా గురు పూర్ణిమ సందర్భాన్ని కూడా రాహుల్ వదలకపోవడం చర్చనీయాంశమైంది.