Begin typing your search above and press return to search.

మోడీని ఓడించటం ఎలానో చెప్పేసిన పీకే

By:  Tupaki Desk   |   22 March 2023 6:00 PM GMT
మోడీని ఓడించటం ఎలానో చెప్పేసిన పీకే
X
పీకే.. ప్రశాంత్ కిశోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తూ.. తాను పని చేసే రాజకీయ పార్టీలను అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా పని చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. అధికారంలోకి రావటానికి ఏమేం చేయాలో వాటన్నింటిని చేసేయటం.. ఇందులో భాగంగా వెనుకా ముందు ఆలోచించటం లాంటివేమీ చేయకుండా పోయే ఆయన.. గతంలో మోడీ సర్కారు అధికారంలోకి రావటానికి వీలుగా పని చేసిన సంగతి తెలిసిందే.

కట్ చేస్తే.. బీజేపీతో బంధం తెంచుకున్న ఆయన తర్వాత వివిధ పార్టీలకు పని చేయటం.. వారందరిని అధికారంలోకి తీసుకొచ్చిన పీకే..తాజాగా మోడీ సర్కారును గద్దె దించటం.. బీజేపీ చేతిలో ఉన్న అధికార పగ్గాల్ని వదిలేలా చేయటాం ఎలా అన్న విషయానికి సంబంధించిన కీలక ఫార్ములాపై వ్యాఖ్యలు చేశారు. ఆసక్తికరంగా మారిన ఈ అంశాన్ని ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా పేర్కొన్నారు. మూడు కవచాలను చేధిస్తే మోడీని గద్దె దించటం సులువైన విషయంగా పేర్కొన్నారు.

2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు జట్టు కడితేనో.. ఐక్యతతో వ్యవహరించిన మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. సైద్ధాంతిక వైరుధ్యాలతో అస్థిరంగా ఉంటుందని.. వివిధ రాజకీయ పార్టీలు ఒక తాటి మీదకు తీసుుకురావటం వల్ల విపక్షాల మధ్య ఐక్యత సాధ్యం కాదన్నారు.

గాంధేయ.. సోషలిస్ట్.. కమ్యూనిస్టు ఇలా అన్ని భావజాలాల నేతలు కలిసి వస్తేనే బీజేపీ ఓడించగలమని చెప్పారు. బీజేపీ బలాలు ఏమిటన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. 'హిందుత్వం.. జాతీయవాదం.. సంక్షేమం ఈ మూడు కూడా బీజేపీకి మూలస్తంభాలు.

ఈ మూడింటిలో కనీసం రెండింటిని ఎదుర్కోలేకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవటం సాధ్యం కాదన్నారు.బీజేపీని హిందుత్వ భావజాలంపై పైచేయి సాధించాలంటే గాంధేయులు.. సోషలిస్టులు.. కమ్యూనిస్టులు.. అంబేడ్కర్ వాదలు.. ఇలా అన్ని భావజాలాల నేతలు రావాలని అంతవరకు మోడీ అండ్ కోను ఓడించే అవకాశం లేదన్నారు.

సైద్ధాంతిక కలయికతోనే బీజేపీని ఓడించలేమని.. సైద్ధాంతిక సమీకరణ జరిగితే తప్పించి బలంగా ఢీ కొనే అవకాశం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీతో పీకేకు ఉన్న పంచాయితీ గురించి కూడా ఆయన ఓపెన్ అయ్యారు. కాంగ్రెస్ పునరుజ్జీవం తన లక్ష్యమైతే.. పార్టీ ఎన్నికల్లో గెలవటమే వారి లక్ష్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ కోరుకున్న మార్గంలో తన ఆలోనలు అమలు చేయటానికి అంగీకరించలేదన్నారు.

బీజేపీని ఎదుర్కోవాలంటే విపక్షాలు ఏం చేయాలన్న దానిపై స్పష్టమైన అవగాహనను వెల్లడించిన పీకే... తన వ్యక్తిగత అంశాలపైనా ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. చాలామంది తాను నెమ్మదిగా ఉంటానని భావిస్తారని.. కానీ తాను చాలా దూకుడుగా ఉంటానని చెప్పారు. అంతేకాదు.. చాలా దూకుడుగా ఉంటానని చెప్పుకునే చాలామంది మీడియా ప్రతినిధులను తాను హ్యాండిల్ చేసినట్లుగా పీకే వెల్లడించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.