మా అత్తకు అద్దె బాయ్ ఫ్రెండ్ కావాలి.. వైరల్ గా మారిన కోడలి ప్రకటన

Wed Jul 21 2021 09:30:49 GMT+0530 (IST)

Our aunt wants a rental boyfriend  ad that has gone viral

నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు మన చుట్టూ ఉండే ప్రతి అంశంలోనూ ప్రకటనల్ని మనల్ని ఫాలో అవుతుంటాయి. ఎక్కడి దాకానో ఎందుకు.. మొబైల్ తెరిచి.. ఏ యాప్ ఓపెన్ చేసినా యాడ్స్ మనల్ని వెంటాడుతుంటాయి. ఇక.. టీవీ ఓపెన్ చేసినా.. న్యూస్ పేపర్ చదివినా.. కాలు బయటకు తీసి రోడ్డు మీదకు వెళ్లినంతనే ప్రకటనలు జోరుగా కనిపిస్తుంటాయి. రోటీన్ గా కనిపించే ప్రకటనలకు భిన్నమైన ప్రకటన చేసిన ఒక కోడలి ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.మన దగ్గర వరుడు కావాలి.. వధువు కావాలంటూ పెళ్లిళ్లకు సంబంధించిన ప్రకటనలు పేపర్లలో కనిపిస్తూ ఉంటాయి. అయితే.. ప్రాశ్చాత్య దేశాల్లో బాయ్ ఫ్రెండ్ కావాలన్నా.. గర్ల్ ఫ్రెండ్ కావాలన్న ప్రకటనలు ఇచ్చుకోవటం.. తామేం కోరుకుంటున్నామో ఇందులో క్లియర్ గా చెబుతుంటారు. తాజాగా అందుకు భిన్నమైన ఒక యాడ్ అమెరికాలో పబ్లిష్ అయ్యింది. న్యూయార్కుకు చెందిన ఒక కోడలు తన 51 ఏళ్ల అత్తకు సంబంధించిన ఒక ప్రకటనను ఇచ్చి సంచలనంగా మారారు.

తన అత్తతో కాస్తంత సమయం గడిపి.. ఒక వివాహ వేడుకకు హాజరయ్యేందుకు 40 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఒక బాయ్ ఫ్రెండ్ అద్దెకు కావాలని క్రెయిగ్స్ లిస్ట్ అనే క్లాసిఫైడ్స్ వెబ్ సైట్ లో ప్రకటన ఇచ్చింది ఒక కోడలు.

ఎవరు పడితే వారు ఈ అద్దె బాయ్ ఫ్రెండ్ డీల్ కు ఓకే కాదంటూ కొన్ని షరతుల్ని కూడా విధించారు. తన అత్తకు బాయ్ ఫ్రెండ్ గా అద్దెకు వచ్చే వ్యక్తికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు బాగా డాన్స్ కూడా వచ్చి ఉండాలన్న షరతును పెట్టారు. ప్రస్తుతం ఈ ప్రకటన వైరల్ గా మారి.. ఆసక్తికర చర్చకు తెర తీసింది. ఈ ప్రకటనలో మరో కీలక అంశం కూడా ఉంది. అదేమంటే.. తన అత్తకు బాయ్ ఫ్రెండ్ గా వ్యవహరించే వ్యక్తికి 960 డాలర్లు.. మన రూపాయిల్లో అయితే రూ.72వేల వరకు ఇస్తామని  ఆఫర్ ఇస్తోంది. ఈ ప్రకటన ఇప్పుడు విపరీతంగా షేర్ అవుతూ.. ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.