చైనా యాప్స్ పై భారతీయుల సరికొత్త అస్త్రం!

Sun May 31 2020 12:33:15 GMT+0530 (IST)

OneTouch AppLabs Remove China Apps Tool to Uninstall

చైనా యాప్స్.. టిక్ టాక్ సహా చాలా చైనా దేశానికి చెందిన యాప్స్ వల్ల భారతీయుల డేటా మొత్తం చైనాకు చేరుతోందని.. దాని వల్ల మన భద్రతకు ముప్పు అన్న వాదన తెరపైకి వచ్చింది. అంతేకాదు.. తాజాగా మహమ్మారిని పుట్టించి ఇంతమంది చావులకు ఇన్ని కోట్ల మందిని రోడ్డున పడేసిన చైనాపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెల్లుబుకుతోంది.ఈ నేపథ్యంలోనే చైనా ఉత్పత్తులు యాప్స్  అన్నింటిని బ్యాన్ చేయాలనే ఉద్యమం ఊపందుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే చైనాపై ఆంక్షలు వేసి పలు నిషేధాజ్ఞలు విధించారు. ఇప్పుడు పలు దేశాలు కూడా అదే బాటలో ఉన్నాయి.

ఇక తాజాగా భారతదేశం నేరుగా చైనా వస్తువుల నిషేధంపై చర్యలు తీసుకోకున్నా.. ప్రధాని నరేంద్రమోడీ మాత్రం ‘స్వదేశీ వస్తువులను’ ఈ కష్టకాలంలో ప్రోత్సహిస్తే మనవారే బతుకుతారని పిలుపునిచ్చాడు.

దీంతో ఆ ఉద్యమంలో భాగంగా మోడీ స్ఫూర్తితో ‘వన్ టచ్ యాప్ ల్యాబ్స్’ సంస్థ ‘రిమూవ్ చైనా యాప్స్’ అనే యాప్ ను తయారు చేసింది.ఈ యాప్ ప్రత్యేకత ఏంటంటే.. దీన్ని ఇన్ స్టాల్ చేసుకుంటే చైనా యాప్స్ అన్నింటిని కనిపెట్టి ఒకేసారి వాటన్నింటిని తీసివేస్తుంది. అన్ ఇన్ స్టాల్ చేస్తుంది. ఈ యాప్ దేశంలో వైరల్ అవుతోంది. ఇప్పటికే లక్ష మంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని చైనా యాప్స్ కు మంగళం పాడేశారు.