Begin typing your search above and press return to search.

ఒక వ్యాక్సిన్ డోస్ తీసుకుంటే చాలు ... కరోనా పీడ విరగడ అవుతుందట !

By:  Tupaki Desk   |   23 Feb 2021 11:30 PM GMT
ఒక వ్యాక్సిన్ డోస్ తీసుకుంటే చాలు ... కరోనా పీడ విరగడ అవుతుందట !
X
కరోనా వైరస్ .. ఈ పేరు వినడానికి కూడా చాలామంది భయంతో వణికిపోతున్నారు. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి ఏడాది దాటిపోయింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ఓ వైపు వేగంగా కొనసాగుతుంది. ఈ సమయంలో దేశంలో కరోనా మహమ్మారి మరోసారి అలజడి రేపుతోంది. పలు వ్యాక్సిన్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చినప్పటికీ ఏ వ్యాక్సిన్ ఎంత స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తుందోనన్న అపోహలు, అనుమానాలు లేకపోలేదు. అయితే ఒక వ్యాక్సిన్ డోస్ ఇస్తే చాలు.. తీవ్రమైన కరోనా నుంచి అధిక రక్షణ ఇస్తుందని తేలింది. అంతేకాదు కరోనాతో ఆస్పత్రిలో చేరే అవకాశాలను భారీగా తగ్గించిందని నిరూపితమైంది.

ఇంగ్లాండ్, స్కాట్లాండ్ లో నిర్వహించిన కరోనా వైరస్ టీకా కార్యక్రమాల్లో నిర్ధారించారు. ముఖ్యంగా యువతలో లక్షణాలు లేని కరోనా బారినపడిన వారిని కూడా ఈ వ్యాక్సిన్ డోస్ రక్షించగలదని తేల్చేశారు. వ్యాక్సినేషన్ ప్రొగ్రామ్ ద్వారా మొదటి డేటాను పరిశోధకులు పరిశీలించారు. ఈ డేటాలో వైరస్ వ్యాప్తిని టీకాలు పూర్తిగా నిరోధించాయని, కొంతమంది వ్యక్తుల్లో వైరస్ బారిన పడకుండా నివారించినట్టు డేటాలో తేలింది. స్కాట్లాండ్ ‌లో ఒకటి, ఇంగ్లాండ్‌ లో రెండు గ్రూపుల్లో కరోనా వ్యాప్తిని నియంత్రించినట్టు డేటాలో గుర్తించారు. ఇంగ్లాండ్‌ లో 65 ఏళ్లలోపు హెల్త్ కేర్ వర్కర్లలో ఫైజర్ .. బయోఎంటెక్ వ్యాక్సిన్ ఒక మోతాదు వైరస్‌ను 70శాతం, రెండవ మోతాదు తర్వాత 85శాతం తగ్గిస్తుందని తేలింది.

ప్రతి రెండు వారాలకు వైరస్ టెస్టులను నిర్వహించారు. మొదటి మోతాదు తీసుకున్న 3 వారాల తరువాత, ఫైజర్ .. బయోఎంటెక్ టీకా తేలికపాటి లేదా అంతకంటే తీవ్రమైన వ్యాధిపై 57శాతం ప్రభావవంతంగా పనిచేసిందని కనుగొన్నారు. చాలా మందికి రెండవ మోతాదు ఇవ్వలేదు.. అయినప్పటికీ వారిలో టీకా సమర్థత 85శాతం పెరిగిందని వెల్లడించింది. ప్రారంభ టీకా మోతాదు పొందిన నాలుగవ వారం నాటికి, ఫైజర్ ఆక్స్ఫర్డ్ ,ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు కరోనాతో ఆస్పత్రిలో చేరే ప్రమాదాన్ని వరుసగా 85శాతం, 94శాతం వరకు తగ్గించాయని స్కాటిష్ యూనివర్శిటీలు పబ్లిక్ హెల్త్ స్కాట్లాండ్ అధ్యయనం వెల్లడించింది.