పవన్ పై సంచలన కామెంట్స్ చేసిన పవనిజం సృష్టికర్త

Sat Dec 14 2019 11:33:32 GMT+0530 (IST)

One More Jolt to Janasena

పవన్ కళ్యాణ్.. తెర ముందు మాత్రమే.. ఆయన ఆత్మ అంతా రాజు రవితేజ. పవన్ కు అత్యంత సన్నిహితుడు ఈయన. ఈయన ఆలోచనల్లోంచే పవన్ పాలిటిక్స్ లోకి వచ్చాడన్న ప్రచారం ఉంది. పవన్ గురించి మొత్తం తెలిసిన రాజు రవితేజ ఆ మధ్య రాసిన ‘పవనిజం’ పుస్తకం వైరల్ అయ్యింది. అప్పటి నుంచే పవనిజం మాట ప్రచారంలోకి వచ్చింది. అంతటి దగ్గరి నుంచి చూసి సన్నిహితుడైన రాజు రవితేజ తాజాగా జనసేనకు రాజీనామా చేశారు. జనసేన పార్టీ పోలిట్ బ్యూరో పదవికి స్వస్తి చెప్పారు. ఈ పరిణామం జనసేన పార్టీకి పవన్ కు షాక్ తగిలినట్టైంది.అయితే రాజు రవితేజ జనసేనకు రాజీనామా చేస్తూ సంచలన లేఖ రాశారు. పవన్ పై దారుణ కామెంట్స్ చేశారు.  ఆ లేఖ ఇప్పుడు దుమారం రేపుతోంది.

పవన్ ఒకప్పుడు మంచి మనిషి అని ఇప్పుడు మాత్రం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని రాజురవితేజ లేఖలో ఆరోపించారు. పవన్ వ్యవహారశైలి నచ్చకే రాజీనామా చేస్తున్నట్టు చెప్పాడు. పవన్ ఒక ప్రమాదకర విభజనకారి అంటూ సంచలన కామెంట్ చేశారు.

జనసేన పుట్టుకలో తాను కీలకపాత్ర పోషించానని.. జనసేన మొదటి ప్రధాన కార్యదర్శిని నేనేనని.. ప్రస్తుతం పొలిట్ బ్యూరో సభ్యుడినని పవన్ వైఖరి నచ్చక వైదొలుగుతున్నట్టు రాజురవితేజ చెప్పుకొచ్చాడు. పవన్ కక్షససాధింపుతనం కుల మత పరమైన ద్వేషంతో నడిచే ప్రమాదకరమైన విభజన శక్తిగా మారిపోయారని సంచలన కామెంట్స్ చేశారు.  రాజకీయ సామాజిక శక్తి గల పదవిని పొందడానికి పవన్ అనర్హుడు అంటూ విమర్శించారు. పవన్ కళ్యాణ్ అధికారానికి అనర్హుడు అంటూ ఘాటు వ్యాఖ్యాలు చేశారు. పవన్ కళ్యాణ్ సమాజానికి ప్రమాదకరం అంటూ ముగించారు.