వలంటీర్ తుపాకీ తయారీ.. తర్వాత ఏం జరిగిందంటే!

Fri May 13 2022 05:00:02 GMT+0530 (IST)

One Booked For Manufacturing Gun

రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థ.. ద్వారా ప్రజలకు.. ప్రభుత్వానికి మధ్య దూరం తగ్గించాలని.. సర్కారు నిర్ణ యించి.. ఆ దిశగా యువతీ యువకులకు.. వలంటీర్ అవకాశం కల్పించింది. అయితే.. ఈ వలంటీర్లలో చాలా మంది అసలు పనికన్నా.. ఎక్స్‌ట్రా పనులు చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. తమకు అప్ప గించిన పనులు చూడడం మానేసి.. అధికార పార్టీ నేతలకు అనంగులుగా పనిచేయడం.. సొంతగా వ్యాపా  రాలు చేయడం.. ఇలా అనేక రూపాల్లో వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.అయితే.. వలంటీర్లలో ఈ వలంటీర్ వేరయా! అన్నట్టుగా.. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం చింతతోపు ఎస్టీ కాలనీకి చెందిన రవి(32) భిన్నంగా వ్యవహరించాడు. వలంటీర్‌గా పనిచేస్తూ.. యూట్యూబ్ చూసి.. నాటు తుపాకులు తయారు చేసే పని నేర్చుకున్నాడు. దీనికి కారణం.. సమీపంలోని అటవీ ప్రాంతంలో పక్షులను జంతువులను వేటాడాలని నిర్ణయించుకున్నాడు. అయితే.. ఈ విషయం.. దాగలేదు. తుపాకీని తయారు చేస్తున్న క్రమంలో తాజాగా.. అతనిఇంటి నుంచి శబ్దాలు బయటకు రావడంతో.. ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

చిత్తూరులోని ఎస్సీ నియోకవర్గం గంగాధర నెల్లూరు మండలం చింతతోపు.. ఎస్టీ కాలనీకి చెందిన రవి కార్వేటినగరం-3 సచివాలయలో వలంటీరుగా విధులు నిర్వహిస్తున్నాడు. రవి నివాసం ఉంటున్న కాలనీ అటవీ ప్రాంతానికి సమీపంలో ఉంటుంది. అక్కడకు పక్షలు వివిధ జంతువులు వస్తుంటాయి. దీంతో వాటిని వేటాడలని రవి నిశ్చయించుకున్నాడు. దీంతో కొద్దిరోజుల కిందట ఓ పాత నాటు తుపాకీని కొనుగో లు చేశాడు.. అది పాతది కావడంతో వేట సాధ్యమయ్యేది కాదు.

వేటకు వెళ్లిన సమయంలో తుస్సుమనేది. ఆ పాత నాటు తుపాకీతో వేటకు వెళ్లడం సాధ్యం కాదని అను కున్న రవి కొత్తది తయారు చేయాలనుకున్నాడు. వెంటనే రంగంలోకి దిగి యూట్యూబ్‌లో తుపాకీ తయా రు చేసే విధానాన్ని సెర్చ్ చేసి చూశాడు. ఒకటి పలుమార్లు వివిధ యూట్యూబ్ వీడియోలు చూసి అవసర మైన పరికరాలను కొన్నాడు. తుపాకీ తయారీ చేపట్టి పూర్తి చేస్తున్న క్రమంలో చుట్టుపక్కల వారికి తెలిసిపో యింది. దీంతో ఆ సమాచారం పోలీసులకు ఫిర్యాదు చేయారు.

రంగంలోకి దిగిన ఎస్ఐ దస్తగిరి బుధవారం సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో రెండు నాటు తుపాకులు తయారీకి ఉపయోగించిన టూల్ కిట్లను సీజ్ చేసి నిందితుడిని రిమాండ్‌కు పంపారు. అయితే.. ప్రజలకు ఉపయోగపడాల్సిన వలంటీర్ వ్యవస్థ ఇలా వ్యవహరిస్తుండడంపై ప్రజల నుంచి విస్మయం వ్యక్తమవుతుండడం గమనార్హం.