Begin typing your search above and press return to search.

ఒక్కసారి కరోనా వచ్చిందంటే మళ్లీ రాదా? మనం ఎన్నిరోజులు సేఫ్​?

By:  Tupaki Desk   |   25 Oct 2020 8:30 AM GMT
ఒక్కసారి కరోనా వచ్చిందంటే మళ్లీ రాదా? మనం ఎన్నిరోజులు సేఫ్​?
X
ఒక్కసారి కరోనా వచ్చినవారికి మరో ఏడునెలల పాటు ఈ వ్యాధి సోకకపోవచ్చని తాజాగా ఓ అధ్యయనం తేల్చిచెప్పింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో సార్స్​ కోవిడ్​2 యాంటీ బాడీస్​ ఏడు నెలల పాటు ఉంటాయట. అరిజోనా యూనివర్సిటీ నిర్వహించిన ఈ అధ్యయనంలో ఈ విషయం తేలింది. కరోనా నుంచి కోలుకున్నాక హై క్వాలిటీ యాంటీబాడీలు తయారవుతాయని పరిశోధకులు నిర్ధారించారు. ఆ యాంటీబాడీలు ఐదు నెలల నుంచి ఏడు నెలల వరకు శరీరంలోనే ఉంటాయని తేల్చేశారు పరిశోధకులు.

కోవిడ్​ నుంచి కోలుకున్న వ్యక్తుల్లో ఇమ్యూనిటీ ఎంతకాలం ఉంటుందో అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తలు 6,000 మందితో ఒక అధ్యయనం చేశారు. దాదాపు 6వేల మందిలో కరోనా యాంటీబాడీల ఉత్పత్తి ఎలా ఉందో కనుగొనేందుకు శాంపిల్స్ సేకరించారు.ఒకసారి కరోనా వైరస్ నుంచి కోలుకున్నాక కనీసంగా ఏడు నెలల పాటు కరోనా యాంటీబాడీలు శరీరంలోనే ఉంటాయని అధ్యయనంలో పరిశోధకులు తేల్చేశారు.

యూనివర్సిటీ ఆప్​ అరిజోనా కాలేజ్​ ఆఫ్​ మెడిసిన్​ ఇమ్యూనాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ దీప్తా భట్టాచార్య మాట్లాడుతూ.. ‘కరోనా నుంచి కోలుకున్న వ్యక్తిలో ఎంతకాలం పాటు యాంటీ బాడీస్​ ఉంటాయని మేము అధ్యయనం చేశాం. దాదాపు ఏడునెలల యాంటీబాడీస్​ ఉంటాయని తేలింది’ అని ఆమె చెప్పారు.

‘వైరస్ మొదట కణాలకు సోకినప్పుడు.. రోగనిరోధక వ్యవస్థ స్వల్పకాలిక ప్లాస్మా కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది వైరస్‌తో పోరాడటానికి యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఆ యాంటీబాడీలు సంక్రమణ జరిగిన 14 రోజుల్లో రక్త పరీక్షలలో కనిపిస్తాయి. రోగనిరోధక ప్రతిస్పందన రెండవ దశ దీర్ఘకాలిక ప్లాస్మా కణాలను సృష్టిస్తాయి. శాశ్వత రోగనిరోధక శక్తిని అందించే అధిక-నాణ్యత యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. కోవిడ్​ యాంటీబాడీలు రక్త పరీక్షలలో కనీసం ఐదు నుండి ఏడు నెలల వరకు ఉంటాయని దీప్తి చెప్పారు.