Begin typing your search above and press return to search.

ఒమ్రికాన్ మ్యూటెంట్ కాంబినేషన్ ఇదేనట

By:  Tupaki Desk   |   28 Nov 2021 5:41 AM GMT
ఒమ్రికాన్ మ్యూటెంట్ కాంబినేషన్ ఇదేనట
X
డెల్టా.. డెల్టా ప్లస్ లాంటి పదాలు కొంతకాలం ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్ని వణికించాయి. ఈ పేర్లను విన్నంతనే వణుకు పుట్టేలా చేశాయి. డెల్టా దెబ్బకు దెబ్బ తిన్న దేశాలు.. డెల్టా ప్లస్ మీద వార్తలు వచ్చినప్పుడు తీవ్రమైన భయాందోళనలకు గురయ్యారు. అయితే.. అంచనా వేసిన దాని కంటే కూడా తక్కువగానే డెల్టా ప్లస్ వేరియంట్ తన ప్రభావాన్ని ప్రపంచం మీద చూపించింది. ఆ మాటకు వస్తే.. కరోనా కథ ముగిసిందని.. మహమ్మారి తీవ్రతను కంట్రోల్ చేయగలిగారన్న ధీమా వ్యక్తమైంది. ఇలాంటివేళ.. తెర మీదకు వచ్చిన ఒమ్రికాన్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కొత్త కలకలంగా మారింది.

ఒమ్రికాన్ వేరియంట్ లోని విలక్షణే ఇదెంత అపాయకరమైనదో చెప్పేస్తుందని చెబుతున్నారు. గతంలో చూసిన అన్ని వేరియంట్ల కంటే ఇదే అత్యంత ప్రమాదకారిగా అభివర్ణిస్తున్నారు. వివిధ మ్యూటెంట్లను పరివర్తనం చెందటం ద్వారా ఒమ్రికాన్ కాంబినేషన్ ఉందని చెప్పాలి. ఈ తరహా కాంబినేషన్ ను ఇంతకు ముందెప్పుడూ చూడలేదంటున్నారు. పోట్రీన్ కు సంబంధించిన 30 రకాల మ్యూటేషన్లు ఉన్నాయి. కొత్త వేరియంట్ ను బీటా వేరియంట్ తో అస్సలు పోల్చలేమని.. తాజా మ్యూటెంట్ తో పోలిస్తే.. బీటా మరుగుజ్జుగా ఉంటుందని చెబుతున్నారు.

అయితే.. రోగనిరోధక శక్తి ఉన్న వారు.. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారు వైరస్ బారి నుంచి తప్పించుకోవచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడున్న వ్యాక్సిన్ కొత్త వేరియంట్ ను ఎదుర్కోగలుగుతున్నాయా? లేదా? అన్నది పూర్తిగా తెలీదని సైంటిస్టులు చెబుతున్నారు. మొత్తంగా ఒమ్రికాన్ అత్యంత ప్రమాదకరమైన వేరియంట్ గా చెప్పక తప్పదు.

ఒమ్రికాన్ వేరియంట్ లో 50 ఉత్పరివర్తనాలు.. స్పైక్ ప్రోటీన్ లో 30 కన్నా ఎక్కువ ఉత్పరివర్తనాలు కనిపించాయి. ఈ స్పైక్ ప్రోటీన్ ద్వారానే వైరస్ మన శరీరంలోకి చొచ్చుకుపోతుంది. అందుకే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లను లక్ష్యాలుగా చేసుకొని కనిపిస్తున్నట్లుగా చెబుతున్నారు.

రెసెప్టర్ బైండింగ్ డొమైన్ లో 10 ఉత్పరివర్తనాలు కనిపించాయి. మనిషి బాడీలోని కణాల్ని ముందుగా తాకేది వైరస్ లోన ఉన్న ఈ రిసెప్టర్ బైండింగ్ డొమైనే. ప్రపంచాన్ని వణికించిన డెల్టా వేరియంట్ లో ఈ రిసెప్టర్ బైండింగ్ డొమైన్ లో రెండు ఉత్పరివర్తనాలు కనిపిస్తే.. ఒమ్రికాన్ లో పది కనిపించటం చూస్తే.. ఇదెంత ప్రమాదకరమైన వేరియంట్ అన్నది ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఇంతకీ ఈ మ్యుటేషన్ ఎలా సాధ్యమై ఉంటుంది? అన్న ప్రశ్నకు నిపుణులు చెబుతున్న సమాధానం చూస్తే.. వైరస్ ను ఏ మాత్రం పోరాడలేని ఒక ఎయిడ్స్ రోగి శరీరంలో తయారై.. బయటపడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.