Begin typing your search above and press return to search.

అధికారుల డమ్మీ వ్యాక్సినేషన్.. నెటిజన్ల ఫైర్

By:  Tupaki Desk   |   22 Jan 2021 7:30 AM GMT
అధికారుల డమ్మీ వ్యాక్సినేషన్.. నెటిజన్ల ఫైర్
X
కరోనా వ్యాక్సిన్ దేశంలోకి వచ్చేసింది. ఆల్ రెడీ వైద్యులు, వైద్యసిబ్బంది, ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వేసేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి భయపడుతున్నారు. తాజాగా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్టు నటించి కెమెరాలకు చిక్కిన ఇద్దరు ఉన్నతాధికారుల నిర్వాకం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

బాధ్యతయతమైన స్థానంలో ఉండి ప్రజలను చైతన్యం చేయాల్సిన అధికారులు ఇలా కెమెరాలకు ఫోజులిచ్చేందుకు డమ్మీ వ్యాక్సినేషన్ నాటకం ఆడటంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

కర్ణాటకలోని తూమ్కూర్ జిల్లా ఆస్పత్రిలో ఈనెల 16న చోటుచేసుకున్న ఈఘటన వైరల్ అయ్యింది. భారత్ బయోటెక్ కోవాగ్జిన్ తొలిసారి వేయించుకున్న వారిలో తూమ్కూర్ డీఎంవో నాగేంద్రప్ప, ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ రజినీ సహా పలువురు అధికారులు ఉన్నారు. నాగేంద్రప్ప, రజినీ ఇద్దరూ వ్యాక్సిన్ వేయించుకున్నట్టుగా నటించినట్టు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం మీడియా కవరేజి కోసం ఇద్దరూ ఫొటోలకు ఫోజు ఇచ్చినట్టు తెలిసింది.

దీంతో ప్రజలు మండిపడుతున్నారు. నిజంగా వ్యాక్సిన్ పనిచేస్తుందా? అధికారులు ఎందుకు నాటకాలు ఆడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం తాము టీకా వేసుకున్నామని.. మీడియా కోరిక మేరకు కెమెరాలకు అలా ఫోజులు ఇచ్చామని అధికారులు వివరణ ఇచ్చారు.