Begin typing your search above and press return to search.
రైలు ప్రమాదంలో 15 లక్షల పరిహారం కోసం ఓ మహిళ పాడు పని.. అడ్డంగా దొరికిపోయి..!
By: Tupaki Desk | 8 Jun 2023 9:00 AM GMTఒడిశా లోని బాలాసోర్ లో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటన అందరి నీ బాధిస్తుంటే.. మరోవైపు..సర్కారు ఇచ్చే పరిహారం కోసం కొందరు కక్కుర్తి పడుతున్నారు. బతికి ఉన్న భర్తను చనిపోయాడని చూపిస్తూ.. కేంద్రం ఇచ్చే 10 లక్షల పరిహారం, రాష్ట్రం ఇచ్చే 5 లక్షల కోసం ఓ మహిళ దరఖాస్తు చేసుకుంది. అయితే.. విషయం తెలిసిన భర్త కాదు..నేను బతికే ఉన్నాను. నా భార్య ను అరెస్టు చేసి జైల్లో పెట్టండి! అని పోలీసుల కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇప్పుడు ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
ఎవరు? ఏంటి?
గీతాంజలి దత్తా, బిజయ్ దత్తా కటక్ జిల్లాకు చెందిన దంపతులు. అయితే, వీరి మధ్య ఏర్పడిన ఘర్షణ కారణంగా 13 ఏళ్ల కిందటే విడిపోయారు. దీంతో ఎవరి కి వారుగా ఉంటున్నారు. తాజాగా ఒడిశా లో జరిగిన రైలు ప్రమాద ఘటన లో తన భర్త బిజయ్ దత్తా చనిపోయాడని, మృతదేహం అప్పగిస్తే అంత్యక్రియలు చేసుకుంటామ ని రైల్వే అధికారుల ను కోరింది. ఇదంతా నిజమని నమ్మిన పోలీసులు మార్చురీ లో ఉన్న మృతదేహాల ను చూపించారు. ఓ డెడ్ బాడీ ని చూపి.. అది తన భర్త మృతదేహమే అని చెప్పింది.
అయితే, ఫార్మాల్టీ ప్రకారం ఆధారాలు చూపాలని ఆ మహిళ ను పోలీసులు కోరారు. దీంతో ఆమె ఆధారాలు చూపించ లేక పోయింది. అయితే తప్పుడు పని చేసిన గీతాంజలి ని పోలీసులు మందలించి వదిలేశారు. కానీ.. ఆమె భర్త బిజయ్ దత్తా మాత్రం వదల్లేదు. బతికుండగానే నన్ను చంపేసింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
గీతాంజలి దత్తా ను కఠినంగా శిక్షించాల ని కేసు పెట్టాడు. ఈ మేరకు పోలీసుల కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం గీతాంజలి దత్తా పరారీ లో ఉంది. కేసు పెట్టి జైల్లో పెడతారనే భయంతో గీతాంజలి దత్త భయంతో అజ్ఞాతం లోకి వెళ్లిందని పోలీసులు తెలిపారు.