Begin typing your search above and press return to search.

కోహ్లీ కెప్టెన్సీ.. ఇక గుడ్ బై యేనా

By:  Tupaki Desk   |   8 Dec 2021 6:30 AM GMT
కోహ్లీ కెప్టెన్సీ.. ఇక గుడ్ బై యేనా
X
టీమిండియా వన్డే కెప్టెన్ విరాట్ కోహ్లి మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సౌతాఫ్రికా పర్యటనకు ముందు తాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న రోహిత్ శర్మకు ఆ బాధ్యతలను అప్పగించేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. ఇప్పటికే టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకున్న విరాట్ ప్రస్తుతం వన్డేలకు సారధ్యం వహిస్తున్నాడు.

తాజాగా ఆయన వన్డే ఫార్మాట్ నుంచి కూడా తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే టెస్ట్ కెప్టెన్ గా కొనసాగేందుకు కోహ్లి సుముఖంగా ఉన్నట్లు సమాచారం. టీ20 వరల్డ్ కప్ లో కెప్టెన్ గా కోహ్లీ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఇక ఆయన వన్డే ఫార్మాట్ నుంచి కూడా తప్పుకోనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

టీ20 వరల్డ్ కప్ తో నిరాశలో ఉన్న భారత క్రీడాభిమానులకు న్యూజిలాండ్ సిరీస్ కాస్త జోష్ తెప్పించింది. ఈ జట్టుపై టీమిండియా అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించింది. ఇండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ సారధ్య బాధ్యతలు చేపట్టి సిరీస్ ను సొంతం చేసుకోవడంలో సఫలమయ్యాడు. ఈ సీరిస్ లో 3-0 తో తో గెలుచుకొనగా రోహిత్ పై అన్ని వైపులా ఆశలు పెరిగాయి.

ఇక రోహిత్ వన్డే కెప్టెన్ గా ఉంటే బెటరనే సంకేతాలు వెలువడ్డాయి. కాగా ఈ సిరీస్ ను విరాట్ కోహ్లి దూరంగా ఉన్నాడు. అయితే టెస్ట్ సిరీస్ లో రెండో టెస్టులో ఎంట్రీ ఇచ్చాడు. అతని కెప్టెన్సీలో ఇండియా 372 పరుగుల భారీ తేడాతో గెలిచి 1-0 గా సిరీస్ ను కైవసం చేసుకుంది.

ఇక తరువాత టీమిండియా సౌతాఫ్రికా టూర్ కు వెళ్లనుంది. ఇక్కడ మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. అయితే కరోనా ఒమిగ్రాన్ సౌతాఫ్రికాలోనే ప్రారంభం కావడంతో దీనిని వాయిదా వేశారు. అయినా సౌతాఫ్రికాతో ఆడేందుకు బీసీసీఐ 20 మంది ఆటగాళ్లను పంపాలని చూస్తోంది.

భారత్ -ఏలో ఉన్న కొందరు యువ ఆటగాళ్లను సైతం ఇందులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నెట్ బౌలర్లుగా సినియర్ జట్టుతోనే ఉంచనున్నారు. ప్రస్తుతం టీమ్ సెలెక్షన్ పై దృష్టి సారించిన కమిటీ చైర్మన్ చేతన్ శర్మ త్వరలో ఈ జట్టును అధికారికంగా ప్రకటించానున్నారు.

కోహ్లి వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు సాధించినా వరల్డ్ కప్ విషయంలో ఫెయిల్ అవుతూ వస్తున్నారు. ఈ క్రమంలో కోహ్లి కంటే రోహిత్ శర్మ కెప్టెన్సీగా ఇప్పటి వరకు పలు సీరిస్ లను గెలుచుకొచ్చాడు. దీంతో రోహిత్ వైపు క్రీడాభిమానులు మొగ్గు చూపుతున్నారు. దీంతో కోహ్లి ఈ విషయం సీరియస్ కాకముందే హుందాగా తప్పుకునేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది.

కొత్తగా వచ్చిన కోచ్ రాహుల్ ద్రావిడ్ సైతం రోహిత్ కెప్టెన్సీతో భారత్ విజయాలు సాధిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుసమాచారం. ఈ నేపథ్యంలో కోహ్లినే వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం టీ 20 ఫార్మాట్ కు రోహిత్ కెప్టెన్ ఉండగా.. వన్డే, టెస్టులకు విరాట్ సారధ్యం వహిస్తున్నారు. 2017 తరువాత టీం ఇండియాకు ఇద్దరు కెప్టెన్లు వ్యవహరిస్తున్నారు. 2014 నుంచి 2017 వరకు భారత జట్టులో ఇద్దరు కెప్టెన్లుగా వ్యవహరించారు. అప్పుడు ధోని టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించగా.. విరాట్ కోహ్లి వన్డే ఫార్మాట్ కు కొత్త కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. ఆ తరువాత అప్పటి నుంచి విరాట్ కోహ్లి మూడు ఫార్మాట్లకు కోహ్లి కెప్టెన్ గా ఉంటున్నారు. తాజాగా కోహ్లి టెస్టులకు మాత్రమే కెప్టెన్ గా వ్యవహరించనున్నారు.