Begin typing your search above and press return to search.

సెప్టెంబర్ లో నోవావాక్స్‌, పిల్లల పై ట్రయల్స్‌... సీరం కీలక ప్రకటన !

By:  Tupaki Desk   |   16 Jun 2021 12:30 PM GMT
సెప్టెంబర్ లో నోవావాక్స్‌, పిల్లల పై ట్రయల్స్‌...  సీరం కీలక ప్రకటన !
X
మనదేశంలో ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతుంది. ఇప్పటికే పలు రకాల వ్యాక్సిన్లు దేశంలో అందుబాటులోకి రాగ , త్వరలోనే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దేశంలో మరో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకొచ్చేదానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. దేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ నోవావాక్స్ క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యే దశలో ఉన్నాయని, ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సీరం సీఈవో అదార్ పూనావల్లా తెలిపారు.

అలాగే , పిల్లలపై వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ ప్రారంభించాలని యోచిస్తున్నట్టు కూడా వెల్లడించారు. నోవావాక్స్‌ టీకా ఒక మాదిరి నుంచి తత్రీవమైన వైరస్‌ బాధితుల్లో 100 శాతం రక్షణనిస్తోందని, సగటున నోవావాక్స్‌ వ్యాక్సిన్ 90 శాతం స‌మ‌ర్ధవంతమైందని పూనావల్లా వెల్లడించారు. అయితే ,గ్లోబల్‌ ట్రయల్స్ డేటా ఆధారంగా తాము లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు.నవంబర్ నాటికి ఇది అందుబాటులోకి రానుందని భావిస్తున్నామన్నారు. రెగ్యులేటరీ ఆమోదం పొందితే కంపెనీ సెప్టెంబరు నాటికి నోవావాక్స్‌ ఉత్పత్తిని ప్రారంభిస్తుందని చెప్పారు. అలాగే పిల్లలకు టీకా అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో నోవావాక్స్ క్లినికల్ ట్రయల్స్ ను జూలైలో ప్రారంభించాలని యోచిస్తున్నామనీ దీనిపై త్వరలోనే డ్రగ్ రెగ్యులేటరీ అనుమతినికోరనున్నామని పూనవల్లా తెలిపారు. నోవావాక్స్ అన్ని ర‌కాల వేరియంట్ల‌పై సమర్ధవంతంగా ప‌నిచేస్తుంద‌ని కలుసుకుంది, నోవావాక్స్ ఇటీవల ప్రకటనలో తెలిపింది. అమెరికా, మెక్సికోలోని 119 సైట్లలో 29,960 మందిపై ట్రయల్స్ చేసినట్టు పేర్కొంది. నోవావాక్స్ టీకాల‌ను సులువుగా నిల్వ చేయ‌వ‌చ్చు.