Begin typing your search above and press return to search.
ప్రపంచం వణికే మాట చెప్పిన కిమ్.. సునామీని క్రియేట్ చేస్తారట
By: Tupaki Desk | 25 March 2023 2:00 PM GMTపిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఏమవుతుంది? ఏమైనా కావొచ్చు. అలానే తన సొంత ప్రయోజనాలు.. అధికారం తప్పించి మరింకేమీ పట్టని కిమ్ లాంటి నియంత చేతికి ప్రపంచాన్ని విధ్వంసం చేసే ఆయుధం దొరికితే? దాని సాంకేతికత సొంతమైతే? విన్నంతనే ఉలికిపాటుకు గురయ్యే విషయాన్ని తాజాగా ఉత్తర కొరియా వెల్లడించింది.
సునామీని సొంతంగా పుట్టించే సత్తా ఉన్న అండర్ వాటర్ డ్రోన్ ను తాము విజయవంతంగా పరీక్షించినట్లుగా వెల్లడైన ప్రకటన ఇప్పుడు గుబులు పుట్టిస్తోంది. ఈ సామర్థ్యంతో భారీ సునామీలను పుట్టించి తీరంలో నౌకాశ్రయాలననూ.. సముద్రం మధ్యలో శత్రు నౌకలను నాశనం చేసే సత్తా ఉత్తరకొరియా సొంతమైనట్లుగా చెప్పాలి. ఇప్పటివరకు ఈ టెక్నాలజీ రష్యా వద్ద మాత్రమే ఉంది. తాజాగా ఉత్తర కొరియా ప్రకటించిన ఈ ప్రకటన వాస్తవమైతే.. ఈ సామర్థ్యం ఉన్న రష్యా తర్వాత రెండో దేశంగా ఉత్తర కొరియా నిలుస్తుంది.
ఇలాంటి డ్రోన్లను ప్రయోగిస్తూ సముద్రమట్టం అనూహ్యంగా పెరిగి పరిసర ప్రాంతాలను పూర్తిగా ముంచెత్తేయటం ఖాయం. ‘హెయిల్’ పేరుతో వ్యవహరించే ఈ డ్రోన్ వ్యవహారం ఇప్పుడు ప్రపంచానికి వణికేలా చేస్తుందని చెప్పాలి. ఈ డ్రోన్ సాయంతో ఏదైనా దేశంలోని తీర ప్రాంతంలో భారీ ఎత్తున ప్రయోగిస్తే.. సమీప నౌకాశ్రయాలతో పాటు.. నగరాలు.. జనావాసాలు మొత్తం నామరూపాల్లేకుండా పోవటం ఖాయం.
అయితే.. రష్యా దగ్గర ఉన్న ఇదే తరహా డ్రోన్ (పొసెయ్ డాన్) ను జలాంతర్గాముల నుంచి ప్రయోగించే సత్తా ఉంది. అంతటి అత్యాధునిక సాంకేతికత ఉత్తర కొరియాకు ఉండే అవకాశం లేదంటున్నారు.
ప్రస్తుతం అమెరికాతో కలిసి దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు చేస్తున్న నేపథ్యంలో ఆ దేశాన్ని బెదిరించేందుకే ఈ తరహా ప్రకటన చేసిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇలాంటి సందేహాలను ఉత్తరకొరియా కొట్టి పారేసింది. కిమ్ ఏలుబడిలో ఉన్న ఉత్తర కొరియా చేసిన తాజా ప్రకటనను చూస్తే.. భారీ ఎత్తున రేడియో ధార్మిక సునామీని పుట్టించే అణుసామర్థ్యంతో కూడిన అండర్ వాటర్ డ్రోన్ హెయిల్ ను తాము విజయవంతంగా ప్రయోగించామని చెప్పింది. ఈ డ్రోన్ ను నీటి అడుగున అరవై గంటల పాటు ప్రయాణించి.. 150 మీటర్ల లోతులో లక్ష్యాన్ని ఛేదించినట్లుగా పేర్కొన్నారు.
తమ డ్రోన్ శక్తి సామర్థ్యాల గురించి ఉత్తరకొరియా వివరాల్ని వెల్లడించింది. తమ డ్రోన్ ను తీరం వద్ద మోహరించొచ్చని పేర్కొంది. రేడియో ధార్మిక సునామీలతో నౌకాశ్రయాలతో పాటు నడి సముద్రంలో శత్రువుల యుద్ధ నౌకలను సైతం నాశనం చేసే సామర్థ్యం ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. గడిచిన మూడు రోజులుగా దీనికి సంబంధించిన ప్రయోగాల్ని దేశాధ్యక్షుడు కిమ్ సమక్షంలో జరుగుతున్నట్లుగా చెప్పే ఫోటోల్ని విడుదల చేయటం తాజా కలకలంగా మారింది. ప్రభుత్వం విడుదల చేసిన ఫోటోల్లో సముద్ర జలాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఫోటోలను విడుదల చేశారు. అయితే.. కిమ్ పక్కన ఉన్న టోర్పెడో లాంటి పరికరం ఏమిటి? దాని సాంకేతికత గురించి మాత్రం ప్రస్తావించకపోవటం గమనార్హం.