Begin typing your search above and press return to search.

ఇరు పార్టీల‌కు ద‌డ పుట్టించిన ఆ మూడు నామినేష‌న్లు

By:  Tupaki Desk   |   26 March 2019 1:10 PM GMT
ఇరు పార్టీల‌కు ద‌డ పుట్టించిన ఆ మూడు నామినేష‌న్లు
X
ఎన్నిక‌ల్లో విచిత్రాలు - టెన్ష‌న్లు ష‌రా మూమూలే. కానీ ఎప్ప‌టిక‌పుడు అవి పార్టీల‌ను భ‌య‌పెడుతుంటాయి. ఈసారి మూడు నామినేష‌న్లు దాఖ‌లు స‌మ‌యం ముగిశాక తీవ్ర‌మైన టెన్ష‌న్ కు గురిచేశాయి. టీడీపీ - వైసీపీ రెండు పార్టీల‌కు ఈ టెన్ష‌న్ త‌ప్ప‌లేదు.

చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి నామినేషన్ ను ఎన్నికల అధికారులు పెండింగ్ లో పెట్టారు. రామచంద్రారెడ్డి నామినేషన్ పత్రాలతో పాటు నో డ్యూస్ సర్టిఫికేట్లు స‌మ‌ర్పించ‌లేదు. దీంతో అధికారులు చింతల నామినేషన్ ను పెండింగ్ లో పెట్టారు. ఇక్క‌డ తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పోటీలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి నామినేషన్ పెండింగ్ లో పడటంతో పీలేరులో ఉత్కంఠ నెలకొంది. అయితే ఎన్నికల అధికారులకు చింత‌ల వివరణ ఇచ్చారట‌. త‌న నామినేష‌న్ క‌చ్చితంగా ఆమోదం పొందుతుంద‌ని చింత‌ల చెప్పారు.

మ‌రోవైపు మంగ‌ళ‌గిరి తెలుగుదేశం అభ్య‌ర్థి - నారా చంద్ర‌బాబు కుమారుడు నారా లోకేష్ నామినేషన్ పై అభ్యంతరాలు వ‌చ్చాయి. ఆయన పోటీ చేస్తున్న‌ది గుంటూరు జిల్లా పరిధిలో. కానీ కృష్ణా జిల్లా అడ్వకేట్ చేత నోటరీ చేయించారట. దీంతో ఈ నామినేష‌న్ కూడా పెండింగ్‌ లో పెట్టారు. ఈ తప్పును సరిచేసేందుకు 24 గంటలు సమయం ఇవ్వ‌డంతో టీడీపీ ఊపిరి పీల్చుకుంది.

ఇంకోవైపు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ అభ్య‌ర్థి షబానా నామినేష‌న్ చెల్ల‌దు అంటూ వ‌చ్చిన వార్త‌ల‌పై కూడా టీడీపీకి ఊర‌ట ల‌భించింది. ఆమెకు విదేశీ పౌర‌స‌త్వం ఉంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే, చివ‌ర‌కు ఆమెకు ఏ పౌర‌స‌త్వం లేద‌ని తేల‌డంతో రిటర్నింగ్‌ అధికారి ఆమె నామినేష‌న్ ఆమోదించారు. షబానా... వైకాపా నుంచి గెలిచిన ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్ కూతురు.