Begin typing your search above and press return to search.

ఒక మాస్కు.. 30సార్లు ఉతికినా నో ప్రాబ్లం

By:  Tupaki Desk   |   5 Aug 2020 4:15 AM GMT
ఒక మాస్కు.. 30సార్లు ఉతికినా నో ప్రాబ్లం
X
కరోనా వేళ.. ముఖానికి మాస్కు.. చేతికి శానిటైజర్ వాడనోళ్లు ఉండరు. ప్రమాదకర వైరస్ నుంచి కాపాడుకోవటానికి కీలమైన మాస్కుకు సంబంధించి ఇప్పటికే మార్కెట్లో ఎన్నో మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే.. చాలామంది అవగాహన లేని కారణంగా.. సురక్షితమైన మాస్కుల్ని వాడే విషయంలో తప్పులు చేస్తున్నారు. ఇలాంటివేళ.. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త మాస్కును తీసుకొచ్చారు.

మూడు.. నాలుగు పొరలు కలిగిన ఈ హైడ్రోఫోబిక్ పాలిమర్లతో బ్యాక్టీరియా.. వైరస్ లను సమర్థంగా నిలువరించే గుణం ఈ మాస్కు సొంతం. సాన్స్ ఫేస్ మాస్కుగా పిలిచే దీనికున్న మరో ప్రత్యేకత ఏమంటే.. ఒక్కో మాస్కును 30సార్లు ఉతికి వాడుకునే వీలుంది. ఇది రెండు..మూడు నెలల వరకు పనికి వస్తుందని చెబుతున్నారు. సాధారణంగా దగ్గినప్పుడు.. తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లలో 0.3మైక్రాన్ల పరిమాణం వరకు ఉన్న వైరస్ ను ఈ మాస్కు నిలువరించే శక్తి ఉందని చెబుతున్నారు.

మార్కెట్లో దొరికే సాధారణ మాస్కుల్లో లేని మరో గుణం ఏమంటే.. వైరస్ ను గరిస్ఠంగా అరవై డెబ్భై శాతం వరకు అడ్డుకునే వీలుందని ఐఐసీటీ సీనియర్ ప్రిన్సిపల్ శాస్త్రవేత్త కమ్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ చెబుతున్నారు. తాము రూపొందించిన మాస్కుల్ని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు వీలుగా సిప్లా ఫౌండేషన్ ముందుకు వచ్చినట్లుగా ఐఐసీటీ చెబుతోంది. అయితే.. ఈ మాస్కులు మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.