Begin typing your search above and press return to search.

నో మోడీ, నో షా .. ఇది పూర్తిగా యడ్యూరప్ప విజయం!

By:  Tupaki Desk   |   10 Dec 2019 5:30 AM GMT
నో మోడీ, నో షా .. ఇది పూర్తిగా యడ్యూరప్ప విజయం!
X
కర్ణాటక లింగాయత్ లెజెండ్, సీఎం బిఎస్ యడ్యూరప్పకు కర్ణాటక ప్రజలు మరో అపురూపమైన విజయాన్ని అందించారు. తాజాగా కర్ణాటకలో ఉపఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కీలక ఉప ఎన్నికలలో 15 అసెంబ్లీ స్థానాల్లో 12 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. దీనితో రాష్ట్రంలో ఇక బీజేపీ ప్రభుత్వానికి ఎటువంటి డోఖా లేదు. దీనితో ఇక కర్ణాటక సీఎంగా యడ్డ్యూరప్ప పూర్తి కాలం పరిపాలన కొనసాగించవచ్చు. కర్ణాటకలో జరిగిన రాజకీయం గురించి అందరికి తెలిసిందే. మొదట అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తరువాత అసెంబ్లీ లో బలం నిరూపించుకోలేక ...సీఎం యడ్డ్యూరప్ప రాజీనామా చేసారు. ఆ తరువాత కాంగ్రెస్-జేడీఎస్‌ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా... అది ఎక్కువ కాలం నిలబడలేక పోయింది. కాంగ్రెస్-జేడీఎస్‌కి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు పలకడంతో... ఆ ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేశారు. దాంతో సభలో సభ్యుల సంఖ్య 208కి చేరింది. ఫలితంగా 105 స్థానాలున్న బీజేపీ... ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఇక ఎమ్మెల్యేల అనర్హత తర్వాత మొత్తం 17లో 15 స్థానాల్లో ఉపఎన్నికలు జరిగాయి. ఈ ఉపఎన్నికలలో బీజేపీ గా విజయం సాధించి .. తన పట్టుని నిలుపుకుంది.

సాధారణంగా బీజేపీ ఎన్నికలు అంటే , ప్రధాని మోడీ , అమిత్ షా వచ్చి ప్రచారాలు నిర్వహిస్తారు. కానీ , కర్ణాటకలో జరిగిన ఉపఎన్నికలలో మాత్రం నరేంద్ర మోడీ లేదా అమిత్ షా రాష్ట్రంలో ప్రచారం చేయలేదు. ఇది అవుట్ అండ్ అవుట్ యడ్డియరప్ప విజయం. అతను ఒంటరిగా ప్రచారాన్ని చేసి , వ్యూహాత్మకంగా తమ వ్యూహాన్ని అమలుచేసి విజయాన్ని అందుకున్నారు. దీనితో రాష్ట్రంలో సీఎం యడ్డ్యూరప్ప ఆధిపత్యం పెరిగే అవకాశం ఉంది.

రాష్ట్రంలో మెజారిటీ నిలుపుకోవడానికి బిజెపికి ఆరు సీట్లు అవసరం. అయితే బీజేపీ ఏకంగా 12 స్థానాలలో గెలిచింది మరియు ఒక సీటు బిజెపి తిరుగుబాటుదారుడికి వెళ్ళింది. ఇక కాంగ్రెస్‌ కు ఓటమి ఎంత అద్భుతంగా ఉందంటే, ఓటమికి భాద్యత వహిస్తూ పిసిసి చీఫ్ దినేష్ గుండు రావు మరియు సిఎల్‌పి నాయకుడు సిద్దరామయ్య తమ రాజీనామాలను హైకమాండ్‌కు పంపారు. కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలలో మాత్రమే విజయం సాధించింది. ఇక జేడీఎస్ దుస్థితి మరింత దారుణంగా ఉంది. జేడీఎస్ అభ్యర్థులు చాలా చోట్ల సెక్యూరిటీ డిపాజిట్లను కోల్పోయారు.