వైసీపీకి షాకిచ్చేలా కీలక ప్రకటన చేసిన నిమ్మగడ్డ ..ఏంటంటే ?

Mon Mar 01 2021 10:28:54 GMT+0530 (IST)

Nimmagadda made a key statement to shock the YSRCP

మున్నిపల్ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే పలు పిటిషన్లను విచారించిన హైకోర్టు మున్సిపల్ ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోలేం అని స్పష్టం చేసింది. దీంతో ఈ నెల 10వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. వరుస క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇదిలా ఉంటే ... గతంలో బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ జరిగిన చోట అభ్యర్ధులకు మరో అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఎస్ ఈసీగా తనకున్నవిశేషాధికారాలను ఆయన వాడబోతున్నట్లు తెలుస్తోంది.వాస్తవానికి గతంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ఈసారి నామినేషన్ల ఉపసంహరణ నుంచి ఎన్నికల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.గతంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అసాధారణ రీతిలో జరిగిన నామినేషన్ల ఉపసంహరణపై ఇప్పటికే నిమ్మగడ్డ దృష్టిపెట్టారు. ఇలాంటి బలవంతపు నామినేషన్ల ఉపసంహరణపై అభ్యర్ధుల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని కలెక్టర్లు ఇతర ఎన్నికల అధికారులను ఆదేశించారు. దీంతో అభ్యర్ధులు ఫిర్యాదులు కూడా చేశారు. కానీ రేపటి నుంచి నామినేషన్ల ఉపసంహరణ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వాటిపై ఇప్పటివరకూ ఎస్ ఈ  సీ ఏ నిర్ణయం తీసుకోలేదు. మున్సిపల్ ఎన్నికల పోరులో గతంలో నామినేషన్లు వేయలేకపోయిన వారు వేసి కూడా బలవంతంగా ఉపసంహరించుకున్న వారికి న్యాయం చేసేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే వీరి విషయంలో సానుకూలంగా ఉన్న నిమ్మగడ్డ వీరి కోసం తన అసాధారణ అధికారాలను ప్రయోగించేందుకు సైతం వెనుకాడబోరని తెలుస్తోంది. ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారిగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అభ్యర్ధులకు మేలు జరిగేలా తాను ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని నిమ్మగడ్డ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. దీంతో అభ్యర్ధులు చేసిన అభ్యర్ధనలపై సానుకూల నిర్ణయం తీసుకుని వారికి మరోసారి నామినేషన్లు వేసే అవకాశం కల్పిస్తామని నిమ్మగడ్డ తెలిపారు. అయితే చాలాచోట్ల ప్రత్యర్థులకు పెద్ద ఎత్తున డబ్బు ముట్టచెప్పి ఏకగ్రీవం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనితో మరోసారి నామినేషన్ వేసేందుకు అవకాశం కల్పిస్తే తమ పరిస్థితి ఏంటని ఏకగ్రీవమైన అభ్యర్థులు వాపోతున్నారు. నిమ్మగడ్డ అలాంటి ప్రకటన కనుక చేస్తే అది ఖచ్చితంగా వైసీపీ పెద్ద షాకే అని చెప్పాలి. దీనితో నిమ్మగడ్డ నిర్ణయం పై అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.