Begin typing your search above and press return to search.

బాబు అన్ స్టాపబుల్ ... పవన్ సైలెంట్...?

By:  Tupaki Desk   |   28 March 2023 6:00 AM GMT
బాబు అన్ స్టాపబుల్ ... పవన్ సైలెంట్...?
X
ఇక ఆగేది లేదు, ఆపేది మనలను ఎవరు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు గర్జిస్తున్నారు. అన్ స్టాపబుల్ అని తన బావమరిది కం సినీ నటుడు బాలయ్య లేటెస్ట్ గా ఓటీటీలో చేసిన టాక్ షో టైటిల్ ని తన సొంతం చేసుకుని మరీ బిగ్ సౌండ్ చేస్తున్నారు. ఏపీలో వచ్చేది మనమే. రేపటి సీఎం తానే అని బాబు అంటున్నారు. గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయం మారుతోంది.

వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా సాగుతున్న రాజకీయంలో బాబు తన సీనియరిటీని అనుభవనాన్ని జొప్పించి మరీ పై చేయి సాధిస్తున్నారు. బస్తీ మే సవాల్ అంటూ వైసీపీని రెచ్చగొడుతున్నారు. వై నాట్ సెవెన్ సీట్స్ అనుకుంటూ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీట్లను అన్నీ స్వీప్ చేయాలని వైసీపీ వేసిన వ్యూహం బెడిసికొట్టింది.

మీకు బలం లేదు అంటూ వైసీపీ గేలి చేసినా తమ బలమేంటో నంబర్ తో సహా టీడీపీ ప్రూవ్ చేసి మరీ విజయ ఢంకా భజాయించేసింది. దాన్ని చూసి వైసీపీ నేతలకు మైండ్ బ్లాక్ అయితే ఏపీలో దూకుడు చేస్తోంది టీడీపీ ఈ ఊపుని అలా కంటిన్యూ చేయాలని డిసైడ్ అయింది.

ఏపీలో వైసీపీని వంచి ఓడించి వరసగా టీడీపీ సాధిస్తున్న విజయాలు తమ్ముళ్ళకు ఆనందం కలిగిస్తున్నాయి. అదే టైం లో కామ్రెడ్స్ సైతం భేష్ అంటున్నారు మరి జనసేన నుంచి మాత్రం ఏ విధమైన రెస్పాన్స్ లేదు అన్న చర్చ వస్తోంది.

నిజానికి ఈ మధ్యలో మూడు పట్టభద్రుల సీట్లను టీడీపీ ఏ అంచనాలు లేకుండ గెలుచుకుని వైసీపీని దెబ్బకొట్టింది. ఆ విజయం అద్భుతం అని అంతా విశ్లేషించారు. వైసీపీని చిత్తుగా ఓడించారు అని విపక్షాలు హ్యాపీగా ఫీల్ అయ్యాయి. వైసీపీని గద్దె దించుతామని, అందుకోసం అన్ని పార్టీలను కలుపుతామని చెప్పుకొచ్చిన పవన్ ఆ పని జరిగిన తరువాత మాత్రం వెంటనే తన రియాక్షన్ ఏంటో చెప్పలేదు.

ఆ తరువాత తాపీగా ఒక ప్రకటనలో రెస్పాండ్ అయ్యారు. వైసీపీ అధికార మదాన్ని ఈ ఎన్నికలు అణచేశాయని. ఇవే ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో రిపీట్ అవుతాయని పేర్కొన్నారు. ఆ తరువాత ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో సీటు టీడీపీ గెలుచుకుంది. ఈ వరస సంతోషాలు సంబరాలు అలా కొనసాగుతున్న వేళ ఇపుడు పవన్ సైలెంట్ కావడం మీద చర్చ సాగుతోంది.

ఎందుకిలా అన్నదే అంతటా అనుకుంటున్న పరిస్థితి. టీడీపీ గెలుపు ని పవన్ కూడా ఎంజాయ్ చేయాలి కదా అన్నదే అందరి మాటగా ఉంది. అయితే టీడీపీ ఒంటరిగా పోరుకు ఈ ఫలితాలు కావాల్సిన శక్తిని ఇస్తున్నాయని గతం కంటే ఇపుడు టీడీపీలో ఎక్కువగా జోష్ కనిపిస్తోందని, అందుకే జనసేన ఆచీ తూచీ రియాక్ట్ అవుతోంది అని అంటున్నారు.

అంతే కాదు ఈ ఎన్నికల్లో ఓటుకు నోటు అన్నది పనిచేసిందని వైసీపీ నుంచి ఘాటైన విమర్శలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ తరహా రొచ్చు రాజకీయంలో తాను ఎందుకు తలదూర్చడం అన్న ఆలోచనతోనే పవన్ మౌనం వహిస్తున్నారు అని అంటున్నారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ళు వ్యవహారాలు ట్రాప్ చేయడాలు పవన్ కి నచ్చకపొవడం వల్లనే ఇలా సైలెంట్ అయ్యారని అంటున్నారు. ఇలాంటి వేళ తాను టీడీపీని అభినందిస్తే కచ్చితంగా తాను వారి రాజకీయాన్ని సమర్ధించినట్లు అవుతుందని పవన్ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అందుకే పవన్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.