Begin typing your search above and press return to search.

కోట్ల‌కు కోట్లు పంచుతున్నాం ఫ‌లితం ఎలా ఉంటుందో... వైసీపీలో ఒక్క‌టే టెన్ష‌న్‌...!

By:  Tupaki Desk   |   22 March 2023 5:00 AM GMT
కోట్ల‌కు కోట్లు పంచుతున్నాం ఫ‌లితం ఎలా ఉంటుందో... వైసీపీలో ఒక్క‌టే టెన్ష‌న్‌...!
X
అప్పులు చేస్తున్నారు.. కోట్ల‌కు కోట్లు.. ఢిల్లీ చుట్టూ తిరిగి.. కేంద్రాన్ని బ్ర‌తిమాలి.. వెయిట్ చేసి.. మ‌రీ అ ప్పులు తెస్తున్నారు. తెచ్చిన‌వి తెచ్చిన‌ట్టుగా ప్ర‌జ‌ల‌కు పంచుతున్నారు. సంక్షేమం ఏదైనా.. నేరుగా ప్ర‌జ ల‌కు డ‌బ్బులు ఇవ్వ‌డ‌మే. ఇదే ప‌నిచేస్తున్న వైసీపీ ప్ర‌భుత్వం.. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. భ‌రిస్తోం ది. ఎటు వైపు నుంచి ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా.. ప్ర‌జ‌లే ముందు! అంటూ.. ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తూనే ఉన్న‌ది.

వాస్త‌వానికి ఇటీవ‌ల తిరువూరులో జ‌గ‌న‌న్న విద్యాదీవెన కార్య‌క్ర‌మంలో ఏకంగా 700 కోట్ల రూపాయ‌ల‌ను జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్కి నిధులు విడుద‌ల చేసింది. అదేస‌మ‌యంలో కేవ‌లం 150 కోట్ల మేర‌కు ఆగిన ఉద్యోగుల వేత‌న బ‌కాయిల‌ను మాత్రం ఇవ్వ‌లేద‌ని.. ఆ వ‌ర్గం ఆగ్ర‌హోద‌గ్రులైంది. అయినప్ప‌టికీ.. సీఎం జ‌గ‌న్ మాత్రం ప్ర‌జ‌ల‌కు, ప‌థ‌కాల‌కే పెద్ద‌పీట వేశారు. మ‌రోవైపు.. కేంద్రం నుంచి ఆర్బీఐ వ‌ర‌కు కూడా.. ప్ర‌బుత్వాన్ని హెచ్చ‌రిస్తున్నారు.

అయిన‌ప్ప‌టికీ.. అప్పులు చేసి మ‌రీ సంక్షేమానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం పెద్ద‌పీట వేస్తోంది. ఇవ‌న్నీ..దేనికోసం అంటే.. మ‌ళ్లీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం ద‌క్కించుకునేందుకే అనే విష‌యం తెలిసిందే. అయితే.. తాజాగా వ‌చ్చిన గ్రాడ్యుయేట్ ఫ‌లితాల‌తో.. ఈ ఆశ‌ల‌పై ఎందుకో డౌట్ కొడుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఉద్యోగుల వేత‌నాలు ఆపి.. ఇత‌ర‌త్రా ప్రాజెక్టులు ఆపి.. కూడా ప్ర‌జ‌లకు మేలు చేస్తున్నా.. గ్రాడ్యుయేట్ అభ్య‌ర్థులు ఇలాంటి తీర్పు ఇవ్వ‌డంపై.. వైసీపీ నేత‌లంతా విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.

నిజానికి ఇప్పుడు జ‌రిగిన ఎన్నిక‌ల‌ను చిన్న‌విగా నేత‌లు పైకి చెబుతున్నా.. దాదాపు 108 నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో జ‌రిగిన‌వి కావ‌డం.. స‌ద‌రు గ్రాడ్యుయేట్ల కుటుంబాల్లోనూ ప్ర‌భుత్వ ప‌థ‌కాల ల‌బ్ధిదారులు ఒక‌రో ఇద్ద‌రో ఉండ‌డం.. వారంతా ప్ర‌భుత్వం నుంచి నిధులు అందుకుంటుండ‌డం అయిన‌ప్ప‌టికీ.. వ్య‌తిరేకంగా ఓటేయ‌డం అనేది వైసీపీని ఇర‌కాటంలోకి నెట్టేసింది. ఇప్పుడు ఏం చేయాలి? వ‌చ్చే ఏడాది కాలంలో ఎలా వ్య‌వ‌హ‌రించాలి? అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రి ఏం చేస్తారోచూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.