Begin typing your search above and press return to search.

ఆ ఓట్లు వైసీపీవి కావా... యాక్షన్ లోకి దిగుతారా ...?

By:  Tupaki Desk   |   17 March 2023 5:15 PM GMT
ఆ ఓట్లు వైసీపీవి కావా...  యాక్షన్ లోకి దిగుతారా ...?
X
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం జరిగింది. ఇది వాస్తవరం. తూర్పు రాయలసీమ సీటుతో పాటు ఉత్తరాంధ్రా సీటులో భారీ ఆధిక్యతను టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులు సాధించారు. అలాగే పశ్చిమ ఎమ్మెల్సీ సీటులో కూడా హోరా హోరీ పోరాడుతున్నారు. రెండవ ప్రాధాన్యత ఓటుతో ఆ సీటు తామే దక్కించుకుంటామని చెబుతున్నారు.

అయితే షాకింగ్ గా మారిన ఈ ఫలితాల పట్ల వైసీపీలో ఎలాంటి రియాక్షన్ వస్తోంది అన్న దాని మీదనే అందరి దృష్టి ఉంది. అయితే వైసీపీలో కొందరు నాయకులు ఈ ఫలితాల పట్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భావిస్తున్నారని అంటున్నారు.

ఈ ఓట్లు తమవి కాదని కూడా పార్టీలో కొందరు అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. పట్టభద్రులు అంటే టీచర్స్ ఉంటారు, ఇతర వర్గాలు, మేధావులు ఉంటారు వారంతా ఎపుడూ ప్రభుత్వానికి యాంటీగానే ఉంటారు కాబట్టి అందులో విశేషం ఏముంది అన్న చర్చ వైసీపీలో వస్తోందని అంటున్నారు. తమ టార్గెట్ ఓటర్లు అయిన సంక్షేమ పధకాల లబ్దిదారులు ఈ ఎన్నికల్లో ఓట్లు వేయలేదని వైసీపీ నేతలు కొందరు తెలివిగా గుర్తు చేస్తున్నారు.

అసలైన ఎన్నికల్లో ఫలితాలు వేరేగా వస్తాయని, అవి తమకు అనుకూలంగా ఉంటాయని కూడా వారు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భిన్నమైన ఫలితాలు వస్తాయని అంటున్నారు. నిజంగా ఇలాంటి విశ్లేషణలు కనుక పార్టీలో జరిగితే మాత్రం అది ఆత్మవంచనగానే ఉంటుందని అంటున్నారు.

రాజకీయ పార్టీలకు ప్రతీ ఎన్నికా కీలకమేనని, అదే విధంగా ఓటర్లు అభిప్రాయం ఎపుడూ తీర్పుగానే చూడాలని అంటున్నారు. అలా కాకుండా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లేదు, అంతా బాగుందని ఈ దశలోనూ అనుకుని ముందుకు సాగితే మాత్రం ఇబ్బందులు తప్పవనే అంటున్నారు.

వైసీపీకి షాకింగ్ గా మారిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఫలితాల విషయంలో అధినేత ముఖ్యమంత్రి జగన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నదే ఇపుడు ముఖ్యం అంటున్నారు. ఈ ఫలితాలతో ఎక్కడ లోపాలు ఉన్నాయో గమనించి తగిన రిపేర్లను పార్టీ చేసుకుంటుందా అన్నది కూడా చూడాలని అంటున్నారు. అలా నిజాయతీగా విశ్లేషించుకుని సరైన తీరున స్పందిస్తేనే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ధీమాగా ఉండేలా పరిస్థితి ఉంటుందని అంటున్న వారూ లేకపోలేదు.

ఇదిలా ఉండగా నాలుగేళ్ళ వైసీపీ అధికార వైభోగంలో చాలా మంది కీలక నాయకులు పార్టీని పట్టించుకోవడం మానేశారని అదే విధంగా ఎమ్మెల్సీ  ఎన్నికలను లైట్ గా తీసుకోవడం వల్లనే ఈ ఫలితాలు వచ్చాయని అంటున్న వారూ ఉన్నారు. మొత్తానికి పనిచేయని వారి మీద కొరడా ఝలిపిస్తాను అంటున్న సీఎం జగన్ ఈ ఫలితాల తరువాత యాక్షన్ లోకి దిగుతారా అన్నదే ఆసక్తికరమైన చర్చగా ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.