Begin typing your search above and press return to search.

ఈ నినాదం వినిపిస్తోందా.. నాయ‌కులూ..!

By:  Tupaki Desk   |   28 Jan 2023 9:00 PM GMT
ఈ నినాదం వినిపిస్తోందా.. నాయ‌కులూ..!
X
త్వ‌ర‌లోనే ఏపీలో ఎన్నిక‌లు రానున్నాయి. దీంతో అన్ని పార్టీల నాయ‌కులు వ్యూహ ప్ర‌తివ్యూహాల‌తో ముందుకుసాగుతున్నా రు. నీ క‌న్నాప‌దాకులు ఎక్కువే చ‌దివానంటూ.. ఒక పార్టీపై మ‌రో పార్టీ పైచేయి సాధించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అయితే.. సంద‌ట్లో స‌డేమియా మాదిరిగా పార్టీల ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. మ‌రోవైపుకుల సంఘాలు కూడా మేం మాత్రం త‌క్కువ‌గా క‌నిపిస్తున్నామా? అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే కాపు నాయ‌కుల హడావుడి ఒక‌వైపు పెరిగిం ది.

మ‌రోవైపు.. తాజాగా బ‌లిజ‌లు కూడా గ‌ళం విప్పారు. ప్ర‌తి జిల్లాకు అంటే.. ప్ర‌తి ఏడు నియోజ‌క‌వ‌ర్గాల‌కు రెండు స్థానాల‌ను త‌మ‌కు ఇవ్వాల‌ని వీరు తాజాగా డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. రాజకీయ రంగంలో బలిజలకు ఊతమిచ్చేలా రా నున్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తం గా ప్రతి జిల్లాలో రెండు నుం చి మూడు అసెంబ్లీ స్థానాల ను బలిజ వర్గీయులకు కేటాయించాలని కాపునాడు నేత‌లు తాజాగా డిమాండ్ చేయ‌డం.. రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది.

అంతేకాదు, రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కలిసి మూడు ఎంపీ సీట్లను బలిజలకు కేటాయించాలనే డిమాండ్‌ను సైతం తెర‌మీదికి తేవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, బలిజ వర్గీయులు పార్టీల కతీతంగా ఏకతాటిపైకి రావాలన్న‌ది ఈ సామాజిక వ‌ర్గం ప్ర‌ధాన అజెండాగా క‌నిపిస్తోంది. అంతేకాదు, బలిజవర్గీయుల న్యాయమైన హక్కుల సాధనే ధ్యేయంగా ముందుకు సాగేందుకు కూడా నాయ‌కులు ఒక్క‌తాటిపైకి వ‌స్తున్నారు. ప‌లితంగా సాధార‌ణంగానే ఈ వేడి ఇత‌ర రాజ‌కీయ పార్టీల‌కు త‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ముఖ్యంగా బలిజల డిమాండ్ల‌ను ప‌రిశీలిస్తే.. వీరిని బీసీ జాబితాలో చేర్చాలనేది కీల‌కంగా ఉంది. అంతేకాదు, ఇలా చేసే పార్టీకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని కూడా వారు తేల్చి చెప్ప‌డం మ‌రింత చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  గతంలో బలిజలకున్న 5 శాతం రిజర్వేషన్లను తిరిగి కొనసాగించే పార్టీకి సంపూర్ణమద్దతిస్తామన‌డం కూడా ఆస‌క్తిగా మారింది. మ‌రి వీరి డిమాండ్ల‌పై నాయ‌కులు, పార్టీలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎన్నిక‌ల ముంగిట బ‌లిజ‌ల గ‌ళం గ‌ట్టిగానే వినిపిస్తుండ‌డం పార్టీల్లోనూ కాక రేపుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.