Begin typing your search above and press return to search.

ఇలా అయితే వైసీపీ మునిగినట్లే...!

By:  Tupaki Desk   |   30 May 2023 6:00 AM GMT
ఇలా అయితే వైసీపీ మునిగినట్లే...!
X
వైసీపీలో అంతా బాగుందా. ఆల్ ఈజ్ వెల్ నా. వైసీపీ అగైన్ 2024 నినాదం వర్కౌట్ అవుతోందా. జగన్ ధీమా నెగ్గుతుందా. అంటే పై స్థాయిలో ఫీల్ గుడ్ అని భావిస్తున్నా గ్రౌండ్ లెవెల్ లో మాత్రం రివర్స్ లో అంతా కనిపిస్తోందిట. ఫ్యాన్ గాలి వడగాలిని తలపిస్తోంది అని అంటున్నారు.

ఏ నియోజకవర్గం చూసినా ఏమున్నది గర్వకారణం అక్కడ అంతా వర్గ పోరుతో వైసీపీ సతమతం అని అంటున్నారు. ఎమ్మెల్యే వర్సెస్ క్యాడర్, ఎమ్మెల్యే వర్సెస్ అసమ్మతి లీడర్స్ ఇలా మొత్తం 175 నియోజకవర్గలలో పరిస్థితి అలాగే ఉంది అని అంటున్నారు.

దీని మీద మొర ఆలకించే నాధుడు లేకపోతే మాకేంటి అన్న నిబ్బరాన్ని వైసీపీ కీలక నేతలు బాధ్యులు కూడా వ్యక్తం చేయడమే విశేషం. ఇలా ఆయా నియోజకవర్గాలలోని అసమ్మతి నాయకులు అంతా ఆ పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్స్ వద్దకు వెళ్ళి తమ సమస్యలను చెప్పుకోవడానికి చూసినా ఆ వైపు నుంచి సరైన ప్రతిస్పందన రావడం లేదు అని అంటున్నారు.

పైగా 2019 ఎన్నికల్లో మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ముప్పయి వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారని, ఇపుడు మాత్రం ఏమవుతుందని మెజారిటీ తగ్గినా ఆ ఎమ్మెల్యే గెలుస్తారు అని చెప్పడంతో సమస్య పరిష్కారం కోసం వెళ్ళిన నేతలు ఖంగు తింటున్నారుట.

నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు సర్దిచెప్పి సమస్యలు పరిష్కరించి పార్టీని ఒక గాటలో పెట్టాల్సిన రీజనల్ కో ఆర్డినేటర్స్ ఇలా అతి ధీమాకు పోవడం తోనే పార్టీలో ఏమి జరుగుతుందో అన్నది అర్ధం కావడంలేదు అని అంటున్నారు. ఇలాంటి అతి ధీమాలు పనికిరావు అని అంటున్నారు.

కర్నాటకలో కూడా బీజేపీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రకంగానే ధీమతో ఉందని, చివరికి రిజల్ట్స్ చూస్తే అంతా ఫల్టీ కొట్టిందని అంటున్నారు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నా కూడా వైసీపీ నేతలు మాత్రం ఏమీ పట్టించుకోకుండా అంతా బాగుంది, పార్టీ లీడర్స్ అవసరం లేదు, క్యాడర్ అంతకంటే అవసరం లేదు అన్న వైఖరితో ముందుకు సాగడం నిజంగా బాధాకరం అని అంటున్నారు.

ముప్పయి వేల మెజారిటీ మూడు వేలకు తగ్గుతుందని అయినా విజయం మనదే అని అనడం ఎంత వరకూ సమంజసం అన్న చర్చ పార్టీలో సాగుతోంది. ఈ మెజారిటీలు అంకెల లెక్కలు అటూ ఇటూ మారిపోవడానికి ఎంతో సేపు పట్టదని అంటున్నారు. రాజకీయాల్లో ఎపుడూ ఒకేలా ఉండదని అయిదేళ్ళ క్రితం ఉన్న ఊపు పార్టీకి ఇపుడు ఉందా అన్నది పెద్ద నాయకులు ఆలోచించక్పోవడమే వైసీపీని మైనస్ గా చూస్తున్నారు.

పై స్థాయిలో అంతా బాగుందని భావించడం వల్లనే ఇలా సాగుతోందని అంటున్నారు. ఓటరు ఎపుడూ తెలివైన వాడని, ఎన్ని వ్యూహాలు పన్నినా ఫల్టీ కొట్టించి అసలైన తీర్పు ఇచ్చే సక్తి ఓటరు ఉందని ఈ సంగతి మరచి ఎవరు రాజకీయాలు చేసినా అవి నేల విడిచి సాము చేసినట్లుగానే ఉంటుందని అంటున్నారు.