సంతోష్ అనే కొడుకున్నాడట... లోకేష్ తానుగానే...?

Wed Aug 10 2022 20:22:15 GMT+0530 (IST)

News on TDP Nara lokesh

రాజకీయాల్లో నిన్నటిది నిన్న నేటిది నేడే. అలా ఉండాలి.లేకపోతే చెత్త అలా పేరుకుపోయి ఉంటుంది. నిజంగా రాజకీయాల్లో అటూ ఇటూ చేసుకునే విమర్శలకు పెద్దగా విలువ కూడా లేదు. జనాలు కూడా వాటిని పట్టించుకోవడం మానేశారు. ఇక వ్యక్తుల మీద చేసే విమర్శలు కూడా హద్దులు దాటుతున్న వేళ అతి జుగుప్సాకరంగా ఉంటున్న వేళ వాటిని కనీసం కళ్ళతో చూసేందుకు ప్రజలు ఇష్టపడడంలేదు. ఇదంతా అందరికీ తెలిసిందే.వ్యక్తిత్వ హననం అన్నది గత కొన్నేళ్ళుగా రాజకీయాల్లో అతి ముఖ్య వ్యూహంగా మారిపోయింది. మొదట్లో దీని సీరియస్ గా తీసుకున్న నేతలు కూడా ఇపుడు ఎవరేమన్నా బే ఫికర్ అనేస్తున్నారు. ఈ నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ భావి వారసుడు లోకేష్ ఎపుడో పదేళ్ళ క్రితం నాటి ఆరోపణ పాచిపోయిన ఆరోపణను తానుగా గుర్తు చేసి మరీ జనాల ముందు పెట్టారు. ఇదిపుడు అవసరమా అంటే ఏమో చినబాబు మైండ్ లో ఏముందో తెలియదు కానీ ఆయన చాలా బోల్డ్ గా దాన్ని బయటపెట్టి నన్ను ఎన్నో అన్నారు అయినా నిరూపించగలిగారా అని అమాయకంగా మీడియా ముందు అడుగుతున్నారు.

ఇంతకీ లోకేష్ అన్నదేంటి అంటే తనకు సంతోష్ అనే కొడుకు ఒకరు ఉన్నారని అపుడెపుడో వైసీపీ వాళ్ళు ప్రచారం చేశారట. ఆయన చెప్పిన సంవత్సరం చూస్తే 2012 అంటున్నారు. అప్పటికి లోకేష్ రాజకీయంగా పెద్దగా యాక్టివ్ గా లేరు అనే చెబుతారు. ఉన్నా తెర వెనకనే ఉన్నారు. మరి అలాంటి లోకేష్ మీద అంతటి ఆరోపణలు వైసీపీ వారు  ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నది ఒక ప్రశ్న. అయితే నాటి నుంచి నేటికి పదేళ్ళు కావస్తోంది. అలాంటిది ఏమీ లేదని జనాలకు గుర్తుంటే కనుక విషయం పూర్తిగా అర్ధమైనట్లే కదా.

దాన్ని మళ్లీ తానుగా కెలికి లోకేష్ మీడియా ముందు చెప్పాల్సిన అవసరం ఉందా అన్నదే ఇక్కడ ప్రశ్న. తాను అమాయకుడిని అని లోకేష్ చెప్పుకోవడానికి తనకు సంతోష్ అని ఒక కొడుకు ఉన్నారని ప్రచారం చేశారని పాత విషయం గుర్తు చేసుకోవడం అలా  మీడియాకు లేటెస్ట్ గా హాట్ న్యూస్ గా చెప్పడం అంటే నిజంగా లోకేష్ అమాయకత్వం తెలుస్తోంది అంటున్నారు. తన మీద ఆరోపణలు చేసి నిరూపించలేని దద్దమ్మలు అని  వైసీపీ వారి మీద లోకేష్ మండిపడ్డారు.

ఇదంతా బాగానే ఉంది కానీ సంతోష్ అనే కొడుకు లోకేష్ కి ఉన్నారా అన్న చర్చ కనుక మళ్లీ జనంలోకి వెళ్తే అది కదా అసలైన బూమరాంగ్ అన్నదే చినబాబుకు అర్ధం కావాలి అని అంటున్నారు. మరో వైపు చూస్తే లోకేష్ తనకు మహిళలు అంటే గౌరవం ఉందని చెప్పుకున్నారు. అలా అంటూనే తాను కూడా జగన్ ఫ్యామిలీ మీద ఆయన కూతుర్ల మీద అనగలను కానీ అనను అని అంటున్నారు.

ఏమిటో చినబాబు మీడియా మీటింగ్స్ తో ఇలాగే తరచూ తాను ఎప్పటికీ  చినబాబునే అనిపించేసుకుంటున్నారు అని అంటున్నారు. మొత్తానికి లోకేష్ కి ఉన్న కొడుకు ఒక్కరే. అతని పేరు దేవాన్ష్.  మరి సంతోష్ అని తనకు ఒక కొడుకు ఉన్నారని రెండవ పెళ్ళి అయిందని అంటున్నారని లోకేష్ మీడియా ఎదుట మళ్ళీ మళ్ళీ  టముకు వేసుకోవడం అంటే నిజంగా చంద్రబాబు పుత్రరత్నమే ఇలా మాట్లాడుతున్నారా అనిపించక మానదు. బాబు చాలా కన్వీయినెంట్ గా కావాల్సిన విషయాలే చెబుతారు. అవే జనాల మెదళ్ళలో ఎక్కాలని ఆయన విశ్వ ప్రయత్నం చేస్తారు. మరి లోకేశం మాత్రం ఎవరు అన్నారో ఎపుడు అన్నారో జనాలకు కూడా గుర్తు లేని విషయాలని బయటపెట్టుకుని ఏమిటో ఈ వాచాలత్వం అని ప్రత్యర్ధులు అంటే తప్పు కాదుగా మరి.