ఈ నియోజకవర్గాల్లో పోటీ లేదు భయ్యా.. వైసీపీ నేతల వాదన..!

Fri Sep 30 2022 19:02:19 GMT+0530 (India Standard Time)

News on AP ycp

ఇదేం అదృష్టమో.. దురదృష్టమో.. తెలియదుకానీ.. రాష్ట్రంలోని 10కిపైగా నియోజకవర్గాల్లో వైసీపీకి పోటీ లేకపోవడం చర్చకు వస్తోంది. ఇది నిజంగా నిజం. ఒకవైపు వైసీపీని ఓడించేస్తామని.. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదేనని పదే పదే చెబుతున్న చంద్రబాబు  కానీ బీజేపీ కానీ పోనీ.. పవన్ కానీ.. ఆయా నియోజకవర్గాల్లో పత్తాలేకుండా పోవడం.. చర్చకు వస్తోంది. ఇదినిజమా అనుకుంటారేమో.. నిజ్జంగా నిజమే అంటున్నారు వైసీపీ నాయకులు.ఇటీవల.. సీఎం జగన్ దగ్గర.. ఎమ్మెల్యేలు.. మంత్రుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా.. కొందరు.. మంత్రులు... ఎమ్మెల్యేలను ఉద్దేశించి..``అన్నా.. ఈ సారి మనం చాలా టఫ్ ఫైట్‌ను ఎదుర్కొన బోతున్నా రు.. బీ అలెర్ట్. ఇది.. నేను చెబుతున్న మాట కాదు.. సర్వే లు చెబుతున్న మాట `` అన్నారట జగన్. అయి తే.. ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర రెడ్డి కిసుక్కున నవ్వారట. వెంటనే అదేంటన్న.. అలా నవ్వుతున్నావ్.. అంటే.. ఆయన చిట్టా మొత్తం విప్పేశారట.

రాష్ట్రంలో పదికిపైగా నియోకవర్గాల్లో టీడీపీకికానీ.. జనసేనకు కానీ.. బీజేపీకి కానీ.. అసలు నాయకులే లేరని.. ఉన్నా వారిలో వారే తన్నుకుంటున్నారని.

వారివల్ల ప్రయోజనం లేదని..ప్రజలు కూడా డిసైడ్ అయిపోయారని.. చెప్పారట. వీటిలో తన నియోజకవర్గంతోపాటు.. పూతలపట్టు జీడీ నెల్లూరు విజయవాడ  వెస్ట్ కృష్ణాలో గుడివాడ గుంటూరులో వెస్ట్ ఈస్ట్ ప్రత్తిపాడు శ్రీకాకుళంలో రాజాం ఇక్కడ ఇద్దరు పోటీ పడుతున్నారని చెప్పారు. ఎవరికి ఇచ్చినా.. మరొకరు రెబల్ అవుతారనేది వీరి మాట.

ఇలా మొత్తం చాలా నియోజనకవర్గాల పేర్లను చెప్పుకొచ్చారట.  మరీ ముఖ్యంగా.. అరకు పాడేరు పోలవరం ఏలూరు ధర్మవరం తిరుపతి ఇలా .. అనేక నియోజకవర్గాలు ఉన్నాయని.. మనోళ్లు కొద్దిగా కష్టపడితే.. అవన్నీ . మళ్లీ మన ఖాతాలోకే వస్తాయని చెప్పుకొచ్చారట. దీంతో జగన్ అయినా..కూడా లైట్ తీసుకోవద్దని.. ప్రజల వద్దకు వెళ్లాల్సిందేనని తనదైన వార్నింగ్ ఇచ్చారట. ఇదీ.. సంగతి!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.