Begin typing your search above and press return to search.

మామ పెట్టిన కండీషన్స్ కు పారిపోయిన కొత్త అల్లుడు

By:  Tupaki Desk   |   10 Jun 2023 12:11 PM GMT
మామ పెట్టిన కండీషన్స్ కు పారిపోయిన కొత్త అల్లుడు
X
మన దేశంలో పెళ్లి అనగానే అందరూ ఆనందపడతారు. ఎందుకంటే రెండు మనసులు కలవడమే కాదు... రెండు కుటుంబాలు ఒక్కటవుతాయి. సమాజానికి మేలు జరుగుతుంది. అందుకే ఫ్రెండ్స్, చుట్టాలు అందరూ వచ్చి వధూ వరులకు కలకాలం కలిసుండాలని ఆశీర్వదిస్తారు. అయితే కొత్త అల్లుడికి వాళ్ల మామ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

అసలు ఏం జరిగిందంటే... ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ జిల్లాలో ఓ జంటకు పెళ్లి నిశ్చాయించారు. ఇరు కుటుంబాలు కలిసి వారికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించాలను కున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ బయటకు వచ్చింది.

ఆ పెళ్లి కొడుకు తన కూతురిని పెళ్లి చేసుకోవాలంటే... 3 కండీషన్స్ పెట్టాడు. అవేంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ప్రపంచంలో ఎవరు అలా పెట్టాలనుకోరు. ఎవరూ ఊహించని షరతులు తన కాబోయే అల్లుడికి పెట్టాడు. అది విన్న అల్లుడితో పాటు.. అక్కడికి వచ్చిన చుట్టాలు, జనాలు సైతం నివ్వెర పోయారు.

అసలు ఆ షరతులు ఏంటంటే... ఏంతో అంగరంగ వైభవంగా ఆ జంటకు పెళ్లి జరిగింది. అయితే వివాహం తర్వాత అప్పగింతలు సమయంలో పెళ్లి కొడుకు మామ కండీషన్లు పెట్టాడు. అందులో ఒకటి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు శారీరక సంబంధం పెట్టుకోవద్దు అని చెప్పాడు.

రెండవది పెళ్లి కూతురు తన చెల్లిని అత్తామామల ఇంటికి తీసుకెళ్లాలి. దాంతో పాటు అక్కా చెల్లెలు ఒకే గదిలో ఉండాలని చెప్పాడు. ఇక మూడవది తాను అల్లుడి ఇంటికి ఎప్పుడు వెళ్లినా అడ్డుచెప్పొద్దని అన్నాడు. దాంతో పాటు.. ప్రత్యేక గది కేటాయించాలని.. ఇలా మూడు కండిషన్లను అల్లుడికి పెట్టాడు.

ఇది విన్న అతడి కుటుంబ సభ్యులతో పాటు... అక్కడి వారంతా అవాక్కయ్యారు. ప్రపంచంలో ఇలాంటి కండిషన్లతో పెళ్లి ఎవరైనా చేస్తారా అని అనుకున్నారు. అసలు ఈ కండిషన్లు అలా ఎందుకు పెట్టాల్సి వచ్చిందో మాత్రం ఎవరికి చెప్పలేదు. అయితే వీటికి ఆ పెళ్లి కొడుకు మాత్రం నిరాకరించి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.