Begin typing your search above and press return to search.

కొత్తది వచ్చేసింది.. మరి పాతదేం చేస్తారు?

By:  Tupaki Desk   |   30 May 2023 9:59 AM GMT
కొత్తది వచ్చేసింది.. మరి పాతదేం చేస్తారు?
X
పార్లమెంటు నూతన భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తన చేతల మీదుగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హోమాలు.. పూజలతో భారీ ఎత్తు నిర్వహించారు. అంతేనా.. తమిళనాడు నుంచి ప్రత్యేక చార్టెర్ ఫ్లైట్ లో 19 మంది మఠాధిపతుల్ని ఢిల్లీకి తీసుకొచ్చి.. స్టార్ హోటళ్లలో బస చేసి.. వారికి ప్రత్యేకంగా వంట మాస్టర్లను సిద్ధం చేసి.. వారికి అనువుగా ఉండే పదార్థాల్ని వండి వార్చటం వరకు వీసమెత్తు లోపం లేకుండా చూసుకోవటం తెలిసిందే.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా మరో కొత్త సందేహాం మనసుల్ని పిండేస్తుంది. కొత్త పార్లమెంటు భవనం అందుబాటులోకి వచ్చిన వేళలో.. పాత భవనాన్ని ఏం చేస్తారు? ఎలా వినియోగిస్తారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

కొత్త భవనాన్ని ప్రజాస్వామ్య దేవాలయంగా ప్రధాని నరేంద్ర మోడీ సైతం అభివర్ణించటం తెలిసిందే.

అన్ని హంగులతో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ నిర్మించిన ఈ భవనం నూటయాభై ఏళ్ల పాటు వినియోగించుకునేందుకు వీలుగా దీన్ని నిర్మించారు.

త్రికోణాకారంలో నాలుగు అంతస్తుల్లో నిర్మించిన ఈ భవనం మొత్తం వైశాల్యం 64,500 చదరపు మీటర్లు ఉంది. కొత్త పార్లమెంటు భవనం సంగతి సరే.. మరి ఠీవీగా నిలిచే పాత పార్లమెంటు భవనం మాటేమిటి? దాన్ని ఏం చేస్తారు? అన్న ప్రశ్నలకు వస్తున్నాయి. దీనికి సంబంధించిన మోడీ సర్కారు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

అయితే.. ఈ భవనాన్ని ఎగ్జిబిషన్ గా మార్చి.. సందర్శకులకు నెలవుగా ఉంచటం.. ఇప్పటివరకు పార్లమెంటు సాక్షిగా చోటు చేసుకున్న పరిణామాల గురించి తెలియజేసేలా ఏర్పాట్లు చేస్తే.. రాబోయే తరాలకు కొత్త.. పాత పార్లమెంటు భవనాల గురించి అవగాహన కలిగేలా చేస్తుందని చెప్పాలి. మరి.. మోడీ సర్కారు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో చూడాలి.