అంబటి రాంబాబుకు కొత్త పేరు...అయ్యన్న సంచలనం...?

Thu May 12 2022 17:00:01 GMT+0530 (IST)

New name for Ambati Rambabu

ఆయన ఏపీకి మంత్రి. పేరు అంబటి రాంబాబు. కానీ విపక్షాలు మాత్రం ఆయన పేరుని మార్చేస్తున్నాయి. ఆ మధ్య జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ అంబటి రాంబాబును  రాంబో అని పిలిచారు. ఇపుడు టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వంతు. ఆయన ఏకంగా రాంబాబుని కాంబాబు అని పిలుస్తూ ఫుల్ ర్యాంగింగ్ చేసి పారేశారు.రాంబాబును  ఒక యూట్యూబ్ చానల్ యాంకర్ ఇంటర్వ్యూ అడితే ఇంటర్వ్యూ ఇస్తా నాకేంటి అంటూ జవాబు చెప్పారంటూ అయ్యన్న సంచలన కామెంట్స్ చేశారు. ఈ వివరాలు ఇంకా ఉన్నాయి అంటూ అయ్యన్న ఆ విషయాన్ని  సస్పెన్స్ లో ఉంచేశారు.

అంటే అయ్యన్న మరిన్ని వివరాలు మళ్ళీ మీడియాకు అందిస్తారా ఆ విషయాలు ఏంటి అన్నది సంచలనం అవుతోంది.

ఇంకో వైపు రాంబాబు మహిళా జర్నలిస్ట్ విషయంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆ వివరాలు అన్నీ కూడా సీఎంవో సహా కీలక వ్యవస్థలకు ఇప్పటికే చేరిందని కూడా అయ్యన్న బాంబు పేల్చారు.

ఇక రాంబాబు బర్తరఫ్ కావడమే తరువాయి అని కూడా ఆయన జోస్యం చెబుతున్నారు. మొత్తానికి అంబటి రాంబాబును కాంబాబు అంటూ హాట్ హాట్ కామెంట్స్ చేసిన అయ్యన్న ప్రస్తుతానికి అంతా సశేషమే అని చెబుతున్నారు.

మరి విశేషాలు ఏమైనా ఉన్నాయా. ఉంటే అవేంటి అన్నది అయ్యన్న చెప్పేంతవరకూ  వేచి చూడాల్సిందే. మొత్తానికి రాక రాక వచ్చిన మంత్రి పదవిలో కుదురుకోకుండా అంబటి రాంబాబు ఇలా బుక్ అయిపోతున్నారా అన్న డౌట్లు అయితే వచ్చేస్తున్నాయి.