Begin typing your search above and press return to search.

మంత్రుల‌ను అవ‌మానిస్తున్న మోడీ!

By:  Tupaki Desk   |   27 Jun 2018 1:33 PM IST
మంత్రుల‌ను అవ‌మానిస్తున్న మోడీ!
X
త‌మ నాయ‌కుడు, ప్ర‌ధానమంత్రికి ఎక్క‌డైనా టీం స‌భ్యులు ముప్పు త‌లపెడుతారా? పైగా సాక్షాత్తు కేంద్ర మంత్రి హోదాలో ఉన్న‌వాళ్లు ఇలాంటి అవాంచిత కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతారా? క‌ల‌లో ఊహించ‌లేం క‌దా? కానీ అదే జ‌రిగింది సాక్షాత్తు ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీ విష‌యంలో. ఇక నుంచి కేంద్ర మంత్రులు గానీ, అధికారులు గానీ ప్రధాని నరేంద్రమోడీని కలుసుకోవాలంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) అనుమతి పొందాల్సి ఉంటుంది. ప్రధాని నరేంద్రమోదీ ప్రాణాలకు అత్యంత తీవ్రమైన ముప్పు పొంచి ఉన్నందున ఆయన భద్రతకు చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ ఆదేశాలు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ భద్రతను పర్యవేక్షిస్తున్న క్లోజ్ ప్రొటెక్షన్ టీం (సీపీటీ)కి హోంశాఖ సూచనలు చేసింది. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జరిగే ప్రచార కార్యక్రమాల సందర్భంగా ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసే ముప్పు పొంచి ఉందని పేర్కొంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో రోడ్‌షోలు తగ్గించుకోవాలని, బహిరంగ సభల్లో పాల్గొనేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని మోడీకి ఎస్పీజీ ఇప్పటికే సూచించినట్లు సమాచారం. అయితే ఇందులో ఒకవేళ అవసరమైతే మంత్రులనైనా, అధికారులనైనా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ప్రధాని వద్దకు అనుమతించాలని పేర్కొన‌డం గ‌మనార్హం.

ఈ నెల ఏడో తేదీన ఢిల్లీలో నిషేధిత మావోయిస్టులతో సంబంధాలు ఉన్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఒకరి ఇంటిలో లభించిన లేఖలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తరహాలో ప్రధాని మోడీని హత్య చేసేందుకు ప్రణాళిక రూపొందించారని పేర్కొన్నట్లుగా ఇటీవల పుణె పోలీసులు న్యాయస్థానానికి తెలిపిన సంగతి తెలిసిందే. ఇటీవల బెంగాల్‌లో ప్రధాని మోడీ పర్యటించినప్పుడు ఒక వ్యక్తి ఆరంచెల భద్రతా వలయాన్ని దాటుకుని వచ్చి ఆయన పాదాలను తాకడం భద్రతా సిబ్బందిని ఆందోళనకు గురిచేసింది. ఈ నేపథ్యంలో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబ, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రాజీవ్ జైన్‌లతో ప్రధాని మోడీ భద్రతపై సమీక్షించారు. భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు ఇతర భద్రతాసంస్థలతో సంప్రదింపులు జరుపాలని అధికారులను రాజ్‌నాథ్ ఆదేశించారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలైన‌ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ సున్నితమైనవని హోంశాఖ పేర్కొంది.