Begin typing your search above and press return to search.

జాతి నిర్మాణం కోసమే నూతన విద్యా విధానం : ప్రధాని మోదీ

By:  Tupaki Desk   |   7 Aug 2020 2:30 PM GMT
జాతి నిర్మాణం కోసమే నూతన విద్యా విధానం : ప్రధాని మోదీ
X
జాతి నిర్మాణం కోసమే దేశంలో నూతన విద్యా విధానాన్ని అమలులోకి తీసుకు వచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు

ఈ విద్యా విధానం తో దేశానికి విస్తృత ప్రయోజనాలు చేకూరుతాయని, పిల్లల లక్ష్యసాధనకు ఎంతో మేలు చేస్తుందని ప్రధాని వెల్లడించారు. 30 ఏళ్ల తర్వాత దేశంలో అమల్లోకి తీసుకొచ్చిన విద్యా విధానంపై ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ విద్యా విధానంతో పిల్లలకు పుస్తకాల భారం తగ్గుతుందని నేర్చుకోవాలనే అభిలాష పెరుగుతుందన్నారు. సృజనాత్మకత, నిశిత పరిశీలన పెంపొందుతుందన్నారు. 21వ శతాబ్దానికి అనుగుణంగా విద్యావిధానంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని, విద్యార్థులు కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవాలని సూచించారు. ఇకపై పిల్లలు తమకు నచ్చిన కోర్సులు చదువుకోవచ్చన్నారు. నర్సరీ నుంచి పీజీ వరకు విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చామన్నారు. ఒకే దేశం -ఒకే విద్యావిధానం ఉండాలని, రాష్ట్రాలన్నీ కొత్త జాతీయ విద్యా విద్యా విధానాన్ని అమలు చేయాలని
ఆయన పిలుపునిచ్చారు. విస్తృత అధ్యయనం తర్వాత ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. కొత్త విద్యా విధానంపై ఎవరికీ అపోహలు అవసరం లేదని భవిష్యత్తు లక్ష్యాలకు విద్యార్థులు సిద్ధం చేయడానికి విద్యా విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.