కరోనా వేగంగా వ్యాపించడం వెనుక అసలు కారణం ఇదే?

Fri Jul 03 2020 14:00:02 GMT+0530 (IST)

Is it the new Virus .. Jet Speed ??spreading?

కరోనా వైరస్ రూపు మార్చుకుంటోంది. వేగంగా వ్యాపిస్తోందని తాజా పరిశోధనల్లో తేలింది. ఒక అధ్యయన నివేదిక ప్రకారం.. ఐరోపా నుంచి అమెరికాకు వ్యాపించిన కరోనావైరస్ పూర్తిగా కొత్తగా మారిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కొత్త వైరస్ మునుపటి కంటే వేగంగా వ్యాపిస్తుందని.. కానీ వ్యక్తిని అనారోగ్యానికి గురిచేయడం లేదని తెలిపారు. కొత్తగా మార్పిడి జరుగుతూ వేగంగా మరింత అంటువ్యాధిగా వ్యాపిస్తుందని తేల్చారు.కొత్తగా మారిన వైరస్ ప్రోటీన్‌ను ప్రభావితం చేస్తుందని.. పరీక్షల్లో ఉన్న ప్రస్తుత టీకాలు స్పైక్ ప్రోటీన్‌ను కూడా లక్ష్యంగా చేసుకుంటాయని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తయరుచేస్తున్న టీకాలను కొత్త వైరస్ పై ఇంకా పరీక్షించాల్సి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. కొత్తగా మారిన ఈ కరోనా వైరస్ ను G614గా పేరు పెట్టారు. యూరోప్ మరియు అమెరికాలో ఇది వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు.

వైరస్ G614 అంటువ్యాధి అయితే ఎక్కువ వ్యాధికారకం కాదు. ఇది ఈ సంవత్సరం మార్చి నాటికి యూరప్ వెలుపల చాలా అరుదుగా ఉంది కానీ మార్చి చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. G614 ఎగువ శ్వాసకోశ ముక్కు సైనసెస్ మరియు గొంతులో వేగంగా వ్యాధి తీవ్రతను కలుగజేస్తుందని తెలిపారు.

పాత కరోనా వైరస్ సోనిక వారి కంటే కొత్త వైరస్ సోకిన రోగులు బాగానే ఉన్నారని.. ఇది ప్రాణాంతకం కాదని అధ్యయనం తెలిపింది. కోరోనావైరస్ సోకిన రోగి ఉత్పత్తి చేసిన యాంటీబాడీస్ తాజా G614 వేరియంట్ వైరస్ ను అడ్డుకుంటున్నాయని తెలిపారు.

తాజాగా ఒకే రోజులో అమెరికాలో అత్యధికంగా 50 మందికి పైగా కొత్త కేసులు నమోదుకావడం వెనుక ఇదే వైరస్ ఉన్నట్టు పరిశోధకులు తేల్చారు. కరోనావైరస్ సంక్రమణ రేటు గణనీయంగా పెరగడం వల్ల అమెరికాలోని 23 కి పైగా రాష్ట్రాలు తిరిగి లాక్ డౌన్ ఎత్తివేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయి.