స్నేహితుడే.. ఇంటికి వచ్చి వేధిస్తున్నాడని సింఫుల్ గా చంపేసింది

Fri Mar 31 2023 10:08:34 GMT+0530 (India Standard Time)

New Type Of Murder In Eturnagaram

కాలం మారింది. పరిస్థితులు మారాయి. నేరాల తీరు మారుతోంది. గతంలో హత్యలు చేయటం అంటే మగాళ్లు మాత్రమే చేస్తారన్నట్లు ఉండేది. ఇప్పుడు.. అందుకు భిన్నంగా ఆడాళ్లు చేస్తున్నారు. అప్పట్లో భార్యల్ని చంపిన భర్తల కథనాలు తరచూ వస్తుండేవి. ఇప్పుడు భర్తల్ని చంపుతున్న భార్యల కథనాలు వరుస పెట్టి వస్తున్న విషయం తెలిసిందే. తనను ప్రేమించాలని.. లేకుంటే చంపేస్తామన్న ఉన్మాదుల తీరును చూశాం. ఇప్పుడు అలా విసిగించి.. వేధించేవాడి ప్రాణాల్ని తీసే కొత్త తరహా క్రైం తెర మీదకు వస్తోంది.నువ్వే కావాలంటూ అదే పనిగా వెంటడి ఇబ్బంది పెడుతున్న ఒక తాగుబోతు ఫ్రెండ్ విషయంలో విసిగిపోయిన ఒక మహిళ చేతులు.. కట్టేసి.. గుంజకు బంధించి కత్తితో పొడిచి చంపిన షాకింగ్ పరిణామం ఏటూరునాగారంలో చోటు చేసుకుంది. ములుగు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకూ అసలేం జరిగిందంటే.. ఏటూరి నాగారానికి చెందిన సంగీత తల్లిదండ్రులు చిన్నతనంలోచనిపోవటంలో నాయనమ్మ దగ్గర ఉండేది. ఆ గ్రామానికి చెందిన 30 ఏళ్ల శ్రీను తాగుబోతు. బాధ్యత లేకుండా తిరిగే అతగాడి తీరుతో విసిగిపోయిన అతడి భార్య.. మూడేళ్ల క్రితం అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి శ్రీనుకు.. సంగీతకు పరిచయం ఏర్పడడటం.. స్నేహంగా మారింది.

కొంతకాలానికి మనస్పర్థలురావటంతో ఏడాదిగా శ్రీనును దూరంగా ఉంచుతోంది సంగీత. అతను మాత్రం ఆమె ఇంటికి వెళ్లి తరచూ వేధింపులకు గురి చేశాడు. దీంతో సంగీత కుల పెద్దలకు ఫిర్యాదు చేసింది. వారు పంచాయితీ చేసి ఆమెకు దూరంగా ఉండాలని శ్రీనును హెచ్చరించారు. అయినా.. అతడు పద్దతి మార్చుకోకపోవటంతో పోలీసులకు కంప్లైంట్ చేసింది. కేసు నమోదు నేపథ్యంలో కొంతకాలం జైలుకు వెళ్లి వచ్చాడు.

ఇదిలా ఉంటే.. తాజాగా బుధవారం అర్థరాత్రి 1.15 గంటల వేళలో సంగీత ఇంటికి వెళ్లిన శ్రీను.. తలుపు తట్టి ఆమెను బయటకు పిలిచాడు. అప్పటిగా బాగా తాగిన శ్రీ మీద కోపంతో ఉన్న సంగీత.. అతడి రెండు చేతులను చున్నీతో కట్టి.. ఇంటి ముందు ఉన్న గుంజకు కట్టేసింది. ఆ తర్వాత కత్తితో పొట్టభాగంలో బలంగా పొడిచేసింది. దీంతో.. తీవ్ర రక్తస్రావానికి గురైన అతడు అక్కడికక్కడే మరణించాడు. అనంతరం నేరుగా ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనకు తానుగా లొంగిపోయింది. అనంతరం ఆమెను రిమాండ్ కు తరలించారు. తనను అదే పనిగా వేధించినోడి అంతు చూసిన ఆమె తీరు స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.