కొత్త పరిశోధన : ఈ ప్రోటీన్ లోపం వల్లే శృంగార కోరికలు తగ్గుతాయట..?

Sat Mar 18 2023 06:00:01 GMT+0530 (India Standard Time)

New Research: Deficiency of this protein can reduce sexual desire..?

ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ బిజీగా గడుపుతున్నారు. కనీసం తినడానికి కూడా ఎవరికీ టైం లేదు. ఇక శృంగారానికి అసలే టైం కేటాయించడం లేదు. వారానికో పదిరోజులకో ఒకసారి దంపతులు కలుస్తున్నారు. ఇద్దరూ ఉద్యోగస్తులు అయితే నెలకు ఒకసారో అలా ఏకమవుతున్నారు. సెక్స్ కోరికలు ఇప్పటి యువతలో బాగా తగ్గిపోతున్నాయి. కొన్ని సార్లు పని పిల్లల వల్ల కూడా అలసిపోయి ఇలా శృంగార కోరికలు తగ్గడానికి పరోక్ష కారణమవుతున్నాయి.అయితే ఇలా శృంగార భావనలు తగ్గడానికి కొన్ని కారణమవుతున్నాయని ఒక కొత్త పరిశోధన తేల్చింది. ముఖ్యంగా ఓ ప్రోటీన్ లోపం వల్ల కూడా ఇలా శృంగార కోరికలు తగ్గుతాయట.

అమెరికాలోని పీఎల్ ఓఎస్ వన్ జర్నల్ లో ప్రచురితమైన పరిశోధన కథనం ప్రకారం.. వయోజన మహిళలకు రోజుకు 46 గ్రాముల ప్రొటీన్ అవసరం. వీరు ప్రతి భోజనంతో కనీసం 15 గ్రాముల ప్రొటీన్ ను తీసుకోవాలి. తక్కువ తీసుకోవడం ప్రోటీన్ లోపం ఏర్పడుతుంది. మహిళలకు ప్రోటీన్ లోపం ఉంటే క్రమరహిత పీరియడ్స్ లైంగిక సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. ప్రోటీన్ లేకపోవడం వల్ల టెస్టోస్టీరాన్ స్తాయిలు తగ్గుతాయి.

స్త్రీలకు ఈ ప్రొటీన్ చాలా ముఖ్యమని పరిశోధనలో తేలింది. తగినంత పోషకాహార పిండం అభివృద్ధిని ప్రభావితం చేస్తోంది. ప్రొటీన్ లోపం కండరాల నష్టానికి దారితీస్తుంది. ఎర్ర రక్తకణాలు తగ్గి ఎముకలు దెబ్బతిన్నాయి. ఈ కారణంగా కూడా శృంగార సమస్యలు వస్తాయని తేలింది.

ప్రోటీన్ రక్త ప్రసరణ సజావుగా సాగడానికి ఎంతో ముఖ్యం. లైంగిక జీవితాన్ని మెరుగుపరుస్తుందని తాజా పరిశోధనలో తేలింది. పప్పు ధాన్యాలు బీన్స్ చికెన్ గుడ్లు మొదలైనవి తింటే ప్రొటీన్ అందుతుంది. శృంగార సామర్థ్యం బాగుపడుతుందని పరిశోధనలో తేలింది. ఇక ప్రొటీన్ కోసం క్వినోవా మొక్కల ఫుడ్ మొక్కజొన్న సాల్మాన్ చేపలు గుడ్లు తింటే ప్రొటీన్ పుష్కలంగా లభిస్తాయి. గుడ్డులో ప్రోటీన్ బాగా ఉంటుందని.. ఇది తింటే ప్రొటీన్ పెరిగి శృంగార సామర్థ్యం పెరుగుతుందని తేలింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.