Begin typing your search above and press return to search.

మరో కొత్తరోగంతో అగ్రరాజ్యం ఉక్కిరిబిక్కిరి.. మెదడును తినేస్తున్న అమీబా

By:  Tupaki Desk   |   29 Sep 2020 5:30 PM GMT
మరో కొత్తరోగంతో అగ్రరాజ్యం ఉక్కిరిబిక్కిరి.. మెదడును తినేస్తున్న అమీబా
X
ఇప్పటికే కరోనా మహమ్మారితో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు అమెరికా వైద్య ఆరోగ్యశాఖ. మరో పిడుగులాంటి వార్త వినిపించింది. ఇప్పుడు అమెరికాలో ఓ కొత్తరోగం మొదలైంది. మనిషి మెదడును తినే ఓ అమీబాను అమెరికాలోని కొన్ని సరస్సుల్లో గుర్తించారు. ఇప్పటికే ఈ మాయదారి రోగం ఓ చిన్నారిని బలిగొంది. టెక్సాస్​లోని కొన్ని సరస్సుల్లో ఈ రకం అమీబా ఉన్నట్టు అధికారులు కనిపెట్టారు. ఈ వింతరోగంతో టెక్సాస్​కు చెందిన ఆరేళ్ల బాలుడు జోసియా ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అమెరికా ప్రభుత్వం అలర్టయ్యింది.

ఈ వింత వ్యాధి గురించి టెక్సాస్​ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. టెక్సాస్​లోని జాక్సన్‌ సరస్సులో మెదడును తినే అమీబా చేరినట్లు సీడీసీ నిపుణులు తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ సరస్సులోని నీటిని తాగొద్దని.. ఆ నీటితో వంట కూడా చేయొద్దని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రస్తుతం అక్కడ అధికారులు క్లోరినేషన్‌ని చేస్తున్నారు.

మెదడును తినే ఈ అమీబా వెచ్చని సరస్సులు, నదులు, హోస్ట్ స్ప్రింగ్‌లలో తిష్ట వేస్తుంటుంది. ఆ నీటిని తాగితే మెదడులోకి చేరుకొని మెదడును తినడం ప్రారంభిస్తుంది.

లక్షణాలు ఏమిటి?
ఈ వింతరోగం వస్తే ముందుగా తల తిరుగుతుంది. ఆ తర్వాత క్రమేసి వాంతులు, జ్వరం రావచ్చు. ఈ లక్షణాలు వెంటనే వైద్య చికిత్స తీసుకోవాలి. వ్యాధి ముదిరితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నది. టెక్సాస్​తో పాటు ఇతర ప్రాంతాల్లోని ప్రజలు కూడా అపరిశుభ్ర నీటిని తాగొద్దని.. క్లోరినేషన్​ చేశాకే నీటిని వినియోగించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.