తెలంగాణలో కొత్తగా 99 కేసులు - నలుగురు మృతి

Tue Jun 02 2020 22:49:06 GMT+0530 (IST)

New Dangerous Desease Spreads in Telangana State

తెలంగాణలో మహమ్మారి వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 99 పాజిటివ్ కేసులు నమోదు కాగా నలుగురు మృతిచెందారు. ఈ విషయమై మంగళవారం వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి మొత్తం కేసులు 2891కి చేరుకోగా మృతుల సంఖ్య 92కి చేరింది.తాజాగా నమోదైన కేసుల్లో 87 మంది రాష్ట్రవాసులు కాగా 12 మంది వలస కార్మికులు విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. ఈ వైరస్ బారిన పడి కోలుకుని డిశ్చార్జయిన వారు 1526 మంది ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1273 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కొత్తగా నమోదైన కేసుల్లో జిల్లాల వారీగా.. జీహెచ్ ఎంసీ పరిధిలో 70 - రంగారెడ్డి 7 - మహబూబ్ నగర్ 1 - మేడ్చల్ 3 - జగిత్యాల 1 - నల్గొండ 2 - మంచిర్యాల 1 - సంగారెడ్డి 1 - సిద్ధిపేట 1. ప్రస్తుతం లాక్ డౌన్ పాక్షికంగా కొనసాగుతుండడంతో కేసులు పెరగడానికి కారణంగా చెబుతున్నారు.