Begin typing your search above and press return to search.

గంగూలీ కోసం కొత్త రాజ్యాంగం.. చెల్లుతుందా?

By:  Tupaki Desk   |   13 Nov 2019 5:30 PM GMT
గంగూలీ కోసం కొత్త రాజ్యాంగం.. చెల్లుతుందా?
X
బీసీసీఐ.. భారత్ లో క్రికెట్ ను నియంత్రించే బోర్డు. ప్రపంచం లోనే అతి సంపన్న ఈ బోర్డుపై ఆధిపత్యం కోసం మాజీ క్రికెటర్లు, దేశంలోని రాజకీయ పార్టీలు చేయని ప్రయత్నాలు లేవు. వేల కోట్ల ఆదాయం కలిగిన బీసీసీఐ ని గుప్పిట పట్టి కొందరు చేసిన పనులు ఇప్పటికీ గుర్తే. అయితే సుప్రీం కోర్టు రంగప్రవేశం చేసి దేశం లో ఎవరి కీ హక్కు లేకుండా కొన సాగుతున్న ఈ బీసీసీఐ ని ప్రక్షాళన చేసి దాని కోసం జస్టిస్ లోధా కమిటీ వేసి కొత్త రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టింది. మొన్నటి వరకు ఆ రాజ్యాంగం ప్రకారమే నడిచింది.

అయితే తాజా గా బీసీసీఐ అధ్యక్షుడి గా ఎన్నికైన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ పదవీకాలాన్ని పొడిగించడానికి బీసీసీఐ రెడీ అయ్యింది. ఏకంగా బీసీసీఐ రాజ్యాగాన్ని సవరించడానికి బోర్డు సభ్యులు సిద్ధమయ్యారు. ఇంకో 9 నెలల పాటు ఉన్న గంగూలీ పదవీ కాలాన్ని ఆరేళ్లకు పెంచడానికి రెడీ అయ్యారు.

బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం ఒక అధ్యక్షుడు మూడేళ్ల పాటు మాత్రమే పదవి లో ఉంటాడు. అయితే డిసెంబర్ 1 జరిగే బీసీసీఐ సమావేశం లో బోర్డు అధ్యక్షుడు గంగూలీ సహా కార్యదర్శుల పదవీ కాలాన్ని పెంచేందుకు సిద్ధమయ్యారు. దీనికి బోర్డు సభ్యులతో పాటు సుప్రీం కోర్టు కూడా ఆమోదం తెలుపాల్సి ఉంటుంది.

కాగా సుప్రీం కోర్టు ఆమోదించిన బీసీసీఐ రాజ్యాంగాన్ని సవరించడమంటే అపహాస్యం చేయడమేనని లోధా కమిటీ ప్యానెల్ కార్యదర్శి గోపాల్ శంకర నారాయణన్ స్పష్టం చేశారు. ఇది సుప్రీం ను ధిక్కరించడే నని ఆయన అన్నారు.

బీసీసీఐ లో ఆరేళ్ల క్రితం చోటుచేసుకున్న ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల తర్వాత బీసీసీఐని సుప్రీం కోర్టు ప్రక్షాళన చేసింది. ఇప్పుడు సుప్రీం కోర్టు నిబంధనల నే గంగూలీ కోసం మార్చ బోవడం చెల్లుతుందో లేదో చూడాలి మరీ.