Begin typing your search above and press return to search.

ఒక్క ఫొటో అనేక కామెంట్లు.. మోడీ పై నెటిజ‌న్ల రుస‌రుస‌!

By:  Tupaki Desk   |   28 May 2023 2:49 PM GMT
ఒక్క ఫొటో అనేక కామెంట్లు.. మోడీ పై నెటిజ‌న్ల రుస‌రుస‌!
X
ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పై నెటిజ‌న్లు రుస‌రుస‌లాడుతున్నారు. "ఎంత తేడా.. ఎంత తేడా!" అంటూ బుగ్గ‌లు నొక్కుకుంటున్నారు. తాజాగా ఢిల్లీలో 12 కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నంతో నిర్మించిన భార‌త నూత‌న పార్ల‌మెంటును ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మాన్నిరెండు ద‌శ‌లుగా నిర్వ‌హించారు. ఒక‌టి.. పూజ‌లు, రాజ‌దండాన్ని ప్ర‌తిష్టించ‌డం.. పార్ల‌మెంటు ను ప్రారంభించ‌డం.. రెండు దేశ ప్ర‌జ‌ల‌ ను ఉద్దేశించి మోడీ ప్ర‌సంగించ‌డం.

అయితే.. తొలి ద‌శ కార్య‌క్ర‌మానికి ఎంపీల‌ను ఎవ‌రినీ పిల‌వ‌లేదు. రెండో ద‌శ కార్య‌క్ర‌మానికి(ఎంపీల‌ను కూర్చోబెట్టి.. ప్ర‌ధాని ప్ర‌సంగించే కార్య‌క్ర‌మం) మాత్రం అంద‌రినీ ఆహ్వానించారు. ఇదిలావుంటే.. ఈ సంద‌ర్భంగా మోడీ.. త‌మిళ‌నాడు కు చెందిన కొంద‌రు సాధువుల‌తో మోడీ గ్రూప్ ఫొటో దిగారు. దీనిని ఆయ‌న ట్వీట్ కూడా చేశారు. అయితే, దీనిపైనే నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటో కు పైన‌.. మ‌రో ఫొటో పెట్టారు.

గ‌తంలో ప్ర‌స్తుతం ఉన్న పార్ల‌మెంటు ను ప్రారంభించిన స‌మ‌యంలో అప్ప‌టి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ తీసుకున్న గ్రూప్ ఫొటో. ఈ ఫొటోలో ఎక్క‌డా స‌న్యాసులు.. మ‌ఠాధిప‌తులు క‌నిపించ‌రు. కానీ. అప్ప‌టి కేంద్ర మంత్రులు.. ఉక్కుమ‌నిషి ప‌టేల్ వంటి మేధావులు ఉన్నారు. ఈ రెండు ఫొటోల‌ను జ‌త క‌లిపి.. నెటిజ‌న్లు మోడీ పై స‌టైర్లు వేస్తున్నారు.

ఇక‌, ఇదే పొటోను ఉటంకిస్తూ.. మ‌రికొంద‌రు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పుల్వమా లో CRPF జవాన్ల ను ఏయిర్ లిఫ్ట్ చేయడానికి మోడీ ప్రభుత్వం నిరాకరించింద‌ని.. దీంతో అక్క‌డ జ‌వాన్లుప్రాణాలు కోల్పోయార‌ని వ్యాఖ్యానించారు. ఇదే విష‌యాన్ని ఇటీవ‌ల జ‌మ్ము క‌శ్మీర్ మాజీ గ‌వ‌ర్న‌ర్ స‌త్య‌పాల్ మాలిక్ కూడ వ్యాఖ్యానించారు. అయితే.. తాజాగా పార్ల‌మెంటు నూత‌న భ‌వ‌నం ప్రారంభంలో మాత్రం.. స్వయం ప్రకటిత అర్చకులకు ప్రత్యేక విమాన సదుపాయం కల్పించి ఢిల్లీ కి పిలిపించడం ప్రభుత్వ ప్రాధాన్యతలు దేనికో అర్దం అవుతోంద‌ని అంటున్నారు. ఈ సంద‌ర్భంగా మోడీ హిందూత్వ రాజ‌కీయం పై న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేస్తున్నారు...