ఏపీ సీఎం జగన్పై నెటిజన్లు ఓ రేంజ్లో ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఆయన ఢిల్లీ వెళ్లి .. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో బేటీ అయ్యారు. ఈ సందర్భంగా .. 'అప్పుల్లో ఉన్నాం.. ఆదరించండి' అని వేడుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. శుక్రవారం నాటి అన్ని ప్రధాన మీడియాల్లోనూ ఇదే హెడ్లైన్తో వార్తలు వచ్చాయి. దీంతో నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.
అప్పుల్లో ఉన్నారా..? అప్పుల పాలయ్యారా? అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అప్పుల్లో ఉండడం అంటే .. విధిలేని పరిస్థితిలో.. అంటే.. ఖర్చులు పెరిగిపోయి.. అభివృద్ధి నిలిచిపోయిందని.. ఇక మాకు అవకాశం లేదు.. కాబట్టి సహకరించండి..! అని వేడుకోవడం. దీనిని ఎవరైనా హర్షిస్తారని.. అభివృద్ధికే కదా.. నిధులు ఖర్చు చేస్తున్నారు.. కాబట్టి సహకరించే అవకాశాన్ని ఎవరూ తప్పుపట్టరని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
కానీ ఏపీ పరిస్థితి అలా లేదుకదా..? అన్నది నెటిజన్ల మాట. ఎందుకంటే..విచ్చలవిడిగా అమలు చేస్తున్న పథకాలు.. ఇచ్చిన వారికే ఏటా వేల కోట్ల రూపాయలు పందేరం చేస్తున్న తీరును వారు తప్పుబడుతున్నా రు.
ఏదైనా అవసరంలో ఉన్న పేదలకు సాయం చేయడాన్ని ఎవరూ తప్పుబట్టరని.. ఇది ప్రభుత్వాల విధి అని.. వారు గుర్తు చేస్తున్నారు. కానీ సీఎం జగన్ సలహాదారుల పేరుతో 60 మందిని నియమించుకుని లక్షల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడుతున్నారు.
ఇక ఇదేసమయంలో అప్పులు పాలు చేశారని.. అప్పు చేయడం వేరు.. అప్పులు పాలవడం వేరని నెటిజ న్లు దుయ్యబడుతున్నారు. రాష్ట్రాన్ని ఉద్దేశ పూర్వకంగా అప్పుల పాలు చేయడం ఇంతకన్నా ఘోరం ఏం ఉంటుందని వారు అంటున్నారు.
ఏదైనా అభివృద్ధి కోసం ప్రయత్నిస్తే.. ఎలాంటి ఇబ్బందులూ ఉండబో వని.. కానీ ఎక్కడా కనుచూపు మేరలో అభివృద్ధి లేదని.. కానీ.. గుట్టలు గుట్టలుగా అప్పులు మాత్రం కనిపిస్తున్నాయని చెబుతున్నాయి. ఇవే విషయాలతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.